జిల్లాల పర్యటనలకు సీఎం కేసీఆర్.. అభివృద్ధిపై ఫోకస్ తోపాటు అదే టార్గెట్.. షెడ్యూల్ ఇదే!!
గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలిచే పార్టీ లేదని నిన్నమొన్నటిదాకా ధీమా వ్యక్తం చేస్తే తాజా పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధినేతను అలెర్ట్ అవ్వాలని సూచిస్తున్నాయి. అందుకే కేసీఆర్ జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు పొందటంతో పాటు, వివిధ జిల్లాలలో పర్యటిస్తూ అటు పార్టీని ప్రక్షాళన చెయ్యాలని కూడా చూస్తున్నారని సమాచారం.
Recommended Video

జిల్లాలలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల నేపధ్యంలో ఇప్పటి నుండే ప్రజా క్షేత్రంలో కేసీఆర్ యాక్టివ్ గా తిరగాలని భావిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ జిల్లాలలో పర్యటించాలని యోచిస్తున్న నేపథ్యంలో రాజకీయ రసవత్తరంగా మారనుంది. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం మళ్లీ రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నట్లు గా తెలుస్తుంది. వికారాబాద్, మేడ్చల్ జిల్లాలలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఇప్పుడు రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలోనూ సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను ప్రారంభిస్తారని తాజా సమాచారం.

సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రంగారెడ్డి
కలెక్టరేట్
ను
ఆగస్టు
25వ
తేదీన
సీఎం
కేసీఆర్
ప్రారంభించనున్నారు.
పెద్దపల్లి
కలెక్టరేట్
భవనాన్ని
ఆగస్టు
29వ
తేదీన
ప్రారంభించనున్నారు.
సెప్టెంబర్
5వ
తేదీన
నిజామాబాద్
కలెక్టరేట్
భవనాన్ని,
సెప్టెంబర్
10న
జగిత్యాల
కలెక్టరేట్‌లను
సీఎం
కేసీఆర్
ప్రారంభించనున్నారు.
ఈ
కలెక్టరేట్
భవనాలను
జాతికి
అంకితం
చేయనున్నారు.
జిల్లాల
పునర్విభజన
తరువాత
తెలంగాణ
ప్రభుత్వం
రాష్ట్రంలోని
అన్ని
జిల్లాల
లోని
సమీకృత
కలెక్టరేట్
ల
నిర్మాణాన్ని
చేపట్టింది.

ఇప్పటికే వికారాబాద్, మేడ్చల్ లో సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రారంభించిన సీఎం
ఇప్పటికే అనేక జిల్లాలలో కొత్త కలెక్టరేట్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అక్కడ ఏర్పాటుచేసిన సభలలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ప్రజలకు చెప్పడం తో పాటు కేంద్రంలోని బిజెపి ని టార్గెట్ చేసే విమర్శలు గుప్పించారు. ఇక ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలోనూ సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడంతో పాటు ప్రతి జిల్లా నుండి ముఖ్యమైన నాయకులను కలుసుకుంటారు . తన పర్యటనలో ప్రతి జిల్లా అభివృద్ధిపై దృష్టి పెడతారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావడానికి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది.

భవిష్యత్ ఎన్నికలే టార్గెట్ .. కేసీఆర్ జిల్లాల పర్యటన
ప్రజాక్షేత్రంలోకి వెళితేనే ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది?టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలి? ప్రతిపక్షాల బలం ఏంటి? నిత్యం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏ విధంగా చెక్ పెట్టాలి? పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? అనేవి తెలుస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ ఎన్నికలను ఉద్దేశించే అన్న చర్చ జరుగుతుంది .