వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూడాల సమ్మెపై సీఎం స్పందన.!విపత్కర సమయంలో సమ్మె చేయడం భావ్యం కాదన్న కేసీఆర్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మానవత్వం కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వం, జూనియర్ డాక్టర్ల పట్ల ఏనాడూ వివక్ష చూపలేదని వారి సమస్యలను పరిష్కరిస్తూనే వుందని, ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని సిఎం చంద్రవేఖర్ రావు స్పష్టం చేశారు.

కరోనా సమయంలో కఠినత్వం వద్దు.. సమ్మె విరమించాలని జూడాలకు సీఎం విజ్ఞప్తి..

కరోనా సమయంలో కఠినత్వం వద్దు.. సమ్మె విరమించాలని జూడాలకు సీఎం విజ్ఞప్తి..

బుధవారం ప్రగతి భవన్ లో వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ కార్యక్రమం, తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల విషయాన్ని వైద్యాధికారులు, సిఎం చంద్రవేఖర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలపై సిఎం చంద్రవేఖర్ రావు స్పందించారు. జూనియర్ డాక్టర్లవి న్యాయమైన కోరికలు అయినపుడు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం వుండబోదని సీఎం స్పష్టం చేసారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చని, అంతేకానీ, చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయాసందర్బాలను కూడా చూడకుండా, సమ్మె పేరుతో విధులను బహిష్కరించడం సరియైన పద్దతి కాదని, అదీకూడా, కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని సిఎం అభిప్రాయ పడ్డారు.

న్యాయమైన డిమాండ్లైతే పరిగణలోకీ తీసుకుంటాం.. తొందరపాటు చర్యలొద్దని జూడాలకు సీఎం సూచన..

న్యాయమైన డిమాండ్లైతే పరిగణలోకీ తీసుకుంటాం.. తొందరపాటు చర్యలొద్దని జూడాలకు సీఎం సూచన..

చాలా రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ ను తెలంగాణ కంటే తక్కువగా ఇస్తున్న విషయాన్ని వైద్యాధికారులు సిఎం చంద్రవేఖర్ రావు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ల సమస్యలు ఏమిటని సిఎం ఆరా తీసారు. అధికారులు సిఎం చంద్రవేఖర్ రావు దృష్టికి తీసుకురాగా, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచాలని సిఎం నిర్ణయించారు. మూడు సంవత్సరాల వైద్య విద్య అభ్యసించి కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్దులకు కూడా సీనియర్ రెసిడెంట్లకిచ్చే గౌరవ వేతనాన్ని అందించాలని సిఎం నిర్ణయించారు.

పరిస్థితులను అర్థం చేసుకోవాలి.. మొండిగా వ్యవహరిస్తే అందరికీ నష్టమేన్న సీఎం..

పరిస్థితులను అర్థం చేసుకోవాలి.. మొండిగా వ్యవహరిస్తే అందరికీ నష్టమేన్న సీఎం..

కరోనా సేవలందిస్తున్న నేపథ్యంలో జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ లో ఇప్పటికే అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగ్గా అందించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలమేరకు ఎక్స్ గ్రేషియాను కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రస్థుతం వారి కోరిక మేరకు సత్వరమే అందించాలని అధికారులను సిఎం చంద్రవేఖర్ రావు ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం కార్యదర్శి, సిఎంవో కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ సెక్రటరీ ఎస్ఎఎం రిజ్వీ, డిఎంఈ రమేశ్ రెడ్డి, డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు, సిఎం ఓఎస్డీ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

జూడాల సమ్మె వల్ల కరోనా బాదితులకు మరింత ఇబ్బంది.. సీఎం జోక్యం చేసుకోవాలన్న కాంగ్రెస్..

జూడాల సమ్మె వల్ల కరోనా బాదితులకు మరింత ఇబ్బంది.. సీఎం జోక్యం చేసుకోవాలన్న కాంగ్రెస్..

రాష్ట్రంలో సమ్మెకు వెళ్తున్న జూనియర్ వైద్యులు మరియు సీనియర్ రెసిడెంట్ వైద్యులతో కలిపి 7000 మంది వైద్యులు చేస్తున్న సమ్మె వల్ల ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ రోగుల చికిత్సలపై ప్రభావితం చూపుతాయని, ఇది రోగులకు నష్టం కలిగిస్తుందని, కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. సీఎం కెసిఆ కోవిడ్ రోగుల పరిస్థితిని అర్థం చేసుకొని పరస్పర పరిష్కారం కోసం జూనియర్ వైద్యులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈనెల 19వ తేదీన సిఎం గాంధీ ఆసుపత్రికి వెళ్ళినపుడు వైద్యులతో చర్చలు జరపి ఉంటే సమ్మె జరిగేది కాదని కాంగ్రెస్ నేత మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి స్పష్టం చేసారు. సమ్మె జరుగుతుంటే చర్చలు జరపకుండా డిఎంఈ కి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని చెప్పడం బాధ్యత రాహిత్యం అవుతుందని మల్లు రవి పేర్కొన్నారు.

English summary
Chief Minister K Chandrasekhar Rao told junior doctors that calling for a strike in the corona catastrophic situation was not humane and that they should take up their duties immediately with public health in mind at such a crucial time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X