మూడు రోజులుగా శ్మశానంలోనే యువతి.. ఎందుకోసం.. అలా ఎలా..?
అమ్మానాన్న.. మాత, పిత, గురు, దైవం.. అలా అయినా.. ఇలా అయినా.. ఎలా చూసుకున్నా కానీ ఈ సృష్టిలో అమ్మ తర్వాతే ఏదైనా. అమ్మ ప్రేమ కంటే గొప్పది మరొకటి ఉండదు. అందుకే అంటుంటారు.. అమ్మ లేని వారిని అడిగితే తెలుస్తోంది.. అసలు అమ్మా ప్రేమ అంటే ఏంటో అని. అందుకే మనుషులు అయినా జంతువులు అయినా ఏదైనా కానీ అమ్మ ప్రేమను కోరుకొని వారు అంటూ ఉండరు. అలాంటి అమ్మ దూరం అయితే గుండె బద్దలవ్వడమే కాకుండా ప్రపంచమంతా అంధకారంలో నిండిపోతుంది. ఈ తరహా హృదయ విదారక ఘటనే తెలంగాణలోని కరీంనగర్లో చోటు చేసుకుంది.
స్థానికంగా ఉన్న సవరన్ షీట్ కబరస్థాన్లో ఒక యువతి ప్రవర్తన స్థానికులను కలచివేసింది. తల్లి మరణం తట్టుకోలేక స్మశానం వద్దే మూడు రోజులుగా ఆమె కూతురు నిద్రిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కూతురు పడుతున్న వేదన అందరినీ భావోద్వేగానికి గురిచేస్తూనే ఒకింత భయాన్ని సైతం కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అసలేం జరిగిందంటే..?
అజ్మత్‌పూర్ నివాసి హసీనా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇటీవల కన్నుమూశారు. దాంతో ఆమె కుమార్తె ఆఫ్రిన్ తీవ్ర ఆవేదనకు లోనైంది. అంత్యక్రియల సమయంలో కన్నీరుమున్నీరుగా విలపించిన ఆమె.. అవి పూర్తయ్యాక కూడా కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఇంటి బాట పట్టినా... ఆఫ్రిన్ మాత్రం సమాధి వద్దే కూర్చుని తల్లి కోసం ఏడుస్తూనే ఉంది. మొదట గంట పాటు ఉంటుందని అనుకున్నా, ఆమె రాత్రంతా అక్కడే గడిపింది. గత మూడు రోజులుగా తల్లి సమాధి వద్దే గడపడం చూసి స్థానికులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు బలవంతంగా తీసుకెళ్లినా కూడా ... ఆమె మళ్లీ సమాధి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చేస్తుంది. రాత్రివేళల్లో కూడా శ్మశానంలో ఉండటంతో స్థానికులు భయంతో పాటుగా ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి లేకపోవడంతో ఆమె మానసికంగా తీవ్రంగా కుంగిపోయి ఇలా చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆఫ్రిన్ తండ్రి, మరికొందరు బంధువులు ఉదయం అక్కడికి చేరుకుని ఆమెను కష్టంగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెను ఇంట్లోనే ఉంచుతూ.. బయటకు వెళ్లనివ్వకుండా పర్యవేక్షిస్తున్నారు.
కాగా ఆమెను పరిశీలించిన వైద్యులు, కౌన్సెలర్లు ఆఫ్రిన్‌కు మానసికంగా తీవ్రమైన షాక్ తగిలి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వెంటనే కౌన్సెలింగ్ అందించడం అవసరమని సూచిస్తున్నారు. ఈ సంఘటన స్థానికులను మాత్రమే కాదు, సోషల్ మీడియాలో చూసిన వారిని కూడా కలచివేస్తోంది.
-
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications