ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముడుపులకు ప్రత్యేకవ్యవస్థ; 140ఫోన్లు: శరత్ చంద్రారెడ్డి అరెస్ట్‌లో షాకింగ్ అంశాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఓవైపు సి.బి.ఐ మరోవైపు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగిస్తూ దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీలాండరింగ్ జరిగిందని రంగంలోకి దిగిన ఈడీ తాజాగా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డిని అరెస్టు చేసింది. అరవింద డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి 64 కోట్ల రూపాయల వరకు మనీలాండరింగ్ పాల్పడ్డారని ఈడి తన రిమాండ్ డైరీలో పేర్కొంది.

ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు
లంచాలు ఇవ్వడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ తెలిపింది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా 169 చోట్ల తనిఖీలు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 34మంది పాత్ర బయటపడిందని వెల్లడించింది.

ఆరు రిటైల్ జోన్ ల కోసం వంద కోట్ల ముడుపులు
34 మంది నిందితులు ఢిల్లీ లిక్కర్ ఇస్కాన్ వెలుగులోకి వచ్చిన వెంటనే 140 ఫోన్లు మార్చారని, సెల్ ఫోన్ లను మార్చడం కోసం వారు ఒక కోటి 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరు రిటైల్ జోన్ ల కోసం పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించింది.
దాదాపు 100 కోట్ల రూపాయల వరకూ లంచాలు ఇచ్చినట్టు పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన తనిఖీలను, చేసిన దర్యాప్తులో డిజిటల్ డివైజెస్ తో పాటుగా రికార్డులను సీజ్ చేశామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది.

శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను అరెస్ట్ చేసిన ఈడీ
ఇదిలా ఉంటే అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలోని లిక్కర్ కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్టు కీలకంగా గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శరత్ చంద్ర రెడ్డి తో పాటు, మద్యం వ్యాపారి వినయ బాబు లను అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో వారిని హాజరు పరిచి, ఈడీ కస్టడీకి ఇవ్వాలని అధికారులు న్యాయస్థానాన్ని కోరారు.

ఈడీ కస్టడీకి నిందితులు .. ఏం చెప్తారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ
శరత్ చంద్ర రెడ్డి తో పాటు, మద్యం వ్యాపారి వినయ బాబు ల వారం రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు కొన్ని షరతులను విధించింది. వారిని సీసీటీవీ పర్యవేక్షణలోనే ప్రశ్నించాలని, 24 గంటలకు ఒకసారి నిందితులకు వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు సూచించింది. దీంతో ఈడి కస్టడీలో శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబు ఏం చెప్తారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్నది కూడా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications