గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య: మానసిక ఒత్తిడే కారణమా?
హైదరాబాద్: నగరంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పులి సునందకుమార్‌రెడ్డి అనే విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఎవరూ లేని సమయంలో కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మానసిక ఒత్తిడితోనే సునందకుమార్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
మృతి చెందిన విద్యార్థి స్వస్థలం గుంటూరు జిల్లా అని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
A 21-year-old student of International Institute of Information Technology (IIIT), Hyderabad, allegedly hanged himself in his hostel room, Gachibowli police said on Thursday.
Story first published: Thursday, April 26, 2018, 23:51 [IST]