మంత్రి హరీష్‌కు జానారెడ్డి కౌంటర్: సభలో నవ్వులు, ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అసెంబ్లీలో రైతుల సమస్యపై కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చేసిన విమర్శలపై సిఎల్పీ నేత జానారెడ్డి వేసిన కౌంటర్ సభలో నవ్వులు పూయించింది. కాంగ్రెస్ పార్టీపై హరీష్‌రావు చేసిన విమర్శలను జానారెడ్డి తిప్పికొట్టారు.

తెలంగాణ అసెంబ్లీలో రైతుల స‌మ‌స్య‌ల‌పై స్వ‌ల్ప‌కాలిక‌ చ‌ర్చపై తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్ రావు కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. సభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే రైతుల‌పై కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ఎంత ప్రేమ‌ ఉందో తెలుస్తోందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.

Funny conversation between Janareddy and Harishrao

రైతుల స‌మ‌స్య‌ల గురించి మాట్లాడ‌డానికి జీవ‌న్ రెడ్డి స‌భ‌లో లేకుండా పోయార‌న్నారు.కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌ ఎవ్వ‌రు కూడ క‌న‌ప‌డ‌డం లేర‌ని ఆయన విమర్శలు గుప్పించారు.

మంత్రి హరీష్‌రావుకు సిఎల్పీ నేత జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 'ఇప్పుడే హ‌రీశ్ రావు ఒక విష‌యం చెప్పారు.. స‌భ‌లో ప్ర‌తి స‌భ్యుడు చెప్పిన విష‌యాన్ని మేము శ్ర‌ద్ధ‌గా వింటున్నాం.. స‌భ‌లో ఇంత‌టి ముఖ్య‌మైన విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు సీఎం కేసీఆర్ లేరు. రైతుల‌పై ఆయ‌న‌కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది' అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వెంటనే సభ్యులంతా నవ్వారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Funny conversation between minister Harishrao and CLP leader Janareddy in Assembly on Wednesday. Clp leader Janareddy answered to minister Harishrao allegations on farmers issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి