వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూట్యూబ్ చూసి కొల్లగొట్టడం నేర్చుకున్నారు: తొందరపడి చిక్కారు

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్గొండ: ఎటిఎంను కొల్లగొట్టడం ఎలాగో యూట్యూబ్‌ను చూసి నేర్చుకున్న ఓ ముఠా తొందరపడి పోలీసులకు చిక్కింది. దినసరి వేతనంపై హోటళ్లు, దుకాణాల్లో పనిచేసేవారు జట్టు కట్టి ఎటిఎంను కొల్లగొట్టడానికి పథకం వేశారు. దాన్ని ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూసి మరీ నేర్చుకున్నారు. కాని ఇంతలోనే దొరికిపోయారు.

నల్లగొండ వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ ఈ వివరాలు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన దీపక్‌ సుబేది రెండు నెలల నుంచి జిల్లా కేంద్రంలోని ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. దాంతో వచ్చే డబ్బులు అతనికి సరిపోవడం లేదు. పైగా తల్లి అనారోగ్యం బారిన పడింది. అధికంగా డబ్బు సంపాదించడానికి దొంగతనమే మార్గమని బావించాడు.

బొట్టుగూడకు చెందిన లతీఫ్‌, ఇమ్రాన్‌లు ఓ బ్యాంకు ఏటీఎం వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వీరితో పరిచయం చేసుకున్న దీపక్‌ ఓ హోటల్‌ నిర్వాహకుడు ఖాజామోహినుద్దిన్‌, మరో మైనర్‌ బాలుడు, నేపాల్‌కు చెందిన రాఖేష్‌లతో జట్టుకట్టాడు. అంతాకలిసి ఏటీఎంలను కొల్లగట్టాలని పథకం పన్నారు.

gang arrested for planning to rob ATM in Nalgonda district

అయితే ఎలా చేయాలో అర్థం కాలేదు. దీంతో యూట్యూబ్‌ను ఆశ్రయించారు. ఇలాంటి చోరీలకు సంబంధించిన వీడియోలను పదేపదే చూశారు. చివరకు దొంగతనానికి పథకం వేశారు. ఒకేసారి వీలైనన్ని ఏటీఎంలను కొల్లగడితే కావలసినంత డబ్బు దొరుకుతుందని భావించారు. ఇందుకోసం అవసరమైతే కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. చోరీ పథకంపై కాగితాల మీద పటాలు కూడా గీసుకున్నారు.

అయితే, చోరీ ప్రణాళిక అమలు కావాలంటే చాలా సమయం పడుతుందని భావించిన దీపక్‌ సుబేది ముందుగా తనకు అత్యవసరంగా సొమ్ము అవసరం కావడంతో శివరాత్రి రోజున తాను ఒక్కడే రంగంలోకి దిగాడు. చోరీ కోసమని ఇనుప తీగ, ఇనుప చువ్వలు, సుత్తి వంటివి తెలిసినవారి దగ్గర ఎరువుకు తీసుకుని వచ్చాడు.

ఒక వాహనాన్ని ఎత్తుకెళ్లి దానికి ఇనుప తీగను తగిలించి, ఏటీఎంకు కట్టి లాగాడు. కాని ఆ తీగ తెగిపోయింది. ప్రయత్నం విఫలవడంతో కంగారులో తన వెంట తీసుకువచ్చిన సుత్తి, ఇనుప చువ్వలు అక్కడే వదిలి పారిపోయాడు. ఈ ఏటీఎంలో చోరీ యత్నంపై విచారణ చేపట్టిన పోలీసులు దీపక్‌ వదలిపోయిన సామగ్రి ఆధారంగా విచారణ జరిపి ముఠాను పట్టుకున్నారు.

English summary
A gang, planned rob ATMs has been nabbed by police at Nalgonda in Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X