బిల్డింగ్ పై నుండి పడి బాలిక మృతి; మిస్టరీగా డెత్ కేసు; అన్నీ అనుమానాలే!!
హైదరాబాద్: హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లోని చంద్రపురి కాలనీలో మంగళవారం రాత్రి అభం శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక భవనంపై నుంచి పడి మృతి చెందింది. అయితే బాలిక మృతి కొత్త అనుమానాలకు కారణంగా మారింది. ఇంట్లో స్టోర్స్ కు వెళ్తున్నా అని చెప్పి బాలిక చంద్రపురి కాలనీ లోని భవనం పైకి ఎందుకు వెళ్ళింది? అసలు అక్కడి నుంచి క్రింద ఎలా పడిపోయింది అన్న అంశం ఇప్పుడు మిస్టరీగా మారింది.

కిరాణా షాప్ కు వెళ్తున్నా అని చెప్పి ఓ బిల్డింగ్ పై నుండి పడి మృతి చెందిన బాలిక
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీ నగర్‌లోని మధురానగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కుమార్తె తొమ్మిది సంవత్సరాల వర్షిత సమీపంలోని ప్రొవిజన్స్ స్టోర్‌కు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఆటోలో చంద్రపురి కాలనీ లోని ఓ బిల్డింగ్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆటోడ్రైవర్ ఫోన్ నుండి గుర్తుతెలియని వ్యక్తి కి ఫోన్ చేసింది. కొద్దిసేపటి తరువాత, అక్కడ భవనంపై నుండి క్రింద పడి చనిపోయింది.

ఆటోలో బాలిక వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు.. మిస్టరీ డెత్ లో అన్నీ అనుమానాలే
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. బాలిక ఇంటి నుంచి ఆటోరిక్షాలో వెళ్లి, చంద్రపురి కాలనీలో భవనంలోకి వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు బాలిక ఆటోలో వెళుతున్న సమయంలో ఎవరికి కాల్ చేసింది? ఎందుకు బాలిక చంద్రపురి కాలనీ కి వెళ్ళింది? ఆ బిల్డింగ్ లోకే బాలిక ఎందుకు వెళ్ళింది? బాలిక పై నుండి ఎలా పడిపోయింది? వంటి అనేక ప్రశ్నలకు ఇప్పటివరకు సమాధానం దొరకలేదు. ఇక వర్షితది హత్యనా లేక ప్రమాదమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించడంతో పాటుగా భవనంలో ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

బాలిక మృతదేహం పోస్ట్ మార్టం, ఆటోవాలా నోరు విప్పితే క్లూ దొరికే ఛాన్స్
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం బాలిక మృతికి సంబంధించి అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంది. అంతే కాకుండా అక్కడ ఘటనా స్థలంలోనే అన్ని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు ఈ మిస్టరీ డెత్ కేసును చేధించే పనిలో పడ్డారు. ఆటోవాలా నోరు విప్పితే అసలు విషయం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

షాక్ లో తల్లిదండ్రులు, తమ బిడ్డకు ఏమైందో చెప్పాలని పోలీసులకు వేడుకోలు
తల్లిదండ్రులు కూడా బాలిక అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఆటోలో ఎలా వెళ్ళింది? ఆ భవనంలోకే ఎందుకు వెళ్ళింది? పై నుండి ఎలా క్రింద పడిపోయింది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నారు. బాలిక విషయంలో ఏం జరిగిందో అర్ధం కాక, విగత జీవిగా మారిన చిన్నారిని చూసి విలపిస్తున్నారు. పోలీసులు తమ బిడ్డ మృతికి గల కారణాలను కనుక్కోవాలని వారు కోరుతున్నారు. తిరిగిరాని లోకాలకు చేరిన తమ బిడ్డను చూసి కంటికి కడివెడు కన్నీరు కారుస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications