తెలంగాణాలో ఆ కొత్త ఎయిర్పోర్ట్ పై శుభవార్త.. త్వరలోనే విమానాలు ఎగురుతాయ్!
వరంగల్ వాసుల చిరకాల కల అయిన మామునూరు ఎయిర్పోర్ట్ పై తాజాగా కేంద్ర మంత్రి శుభవార్త చెప్పారు. నిన్న వరంగల్‌లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, విమానాశ్రయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. విమాన సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఎయిర్ పోర్టు నిర్మాణానికి క్లియరెన్స్ వచ్చింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
విమానాశ్రయ పనుల్లో వేగం పెరిగిందని పేర్కొన్న ఆయన వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు విషయంలో 696ఎకరాల భూమి ఎయిర్ పోర్టు అధికారుల వద్ద ఉందన్నారు. ఇప్పటికే ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చిందని వెల్లడించారు. 2021లో నాటి పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వరంగల్ వచ్చి, నాటి సీఎం కేసీఆర్ కు మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముందుకు రావాలని లేఖ ద్వారా కోరారని గుర్తు చేశారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం జాప్యం
ఇదే విషయంలో సహకరించాలని 2022 జూలై, 2023 ఫిబ్రవరిలో నేను స్వయంగా కేసీఆర్ గారికి లేఖ రాశాను. అయితే ఎలాంటి స్పందన రాలేదన్నారు . గత ప్రభుత్వం విమానాశ్రయ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 280 ఎకరాల భూమి సేకరించేందుకు ముందుకు వచ్చింది. భూసేకరణ త్వరగా పూర్తి చేసి భూమిని, ఎయిర్ పోర్టు అథారిటీకి అందజేస్తే త్వరగా నిర్మాణం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
భూమి అప్పగిస్తే పనులు వేగవంతం
రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ జరిపి కేంద్రానికి అప్పగిస్తే పనులు మరింత వేగంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రారంభంలో చిన్న విమానాలను నడుపుతామని, ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి దూరప్రాంతాలకు కూడా సర్వీసులను తీసుకుంటామని వెల్లడించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తున్నారు.
అయోధ్య ఎయిర్ పోర్ట్ లా స్పీడ్ గా, కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ లా అందంగా
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో పనులను వేగవంతం చేయాలని భావిస్తోంది. దీనిని కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయ తరహాలో నిర్మాణం చేయాలని ఆలోచిస్తోంది. అయోధ్య ఎయిర్ పోర్ట్ లా తక్కువ సమయంలోనే కేవలం 20 నెలల లోనే దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా ఉన్న మామునూరు విమానాశ్రయం హైదరాబాద్ చివరి నిజాం 1930లో నిర్మించారు. 1981 వరకు సేవలందించిన ఈ విమానాశ్రయం తర్వాత మూతపడింది. మళ్లీ ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications