కొత్త వాహనం కొనే వారికి బిగ్ అలర్ట్, రిజిస్ట్రేషన్ లో కొత్త విధానం- నేరుగా ఇంటికే..!!
కొత్త వాహనాలు కొనుగోలు దారులకు బిగ్ అప్డేట్. వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. వాహన రిజిస్ట్రేషన్ కార్డు(ఆర్సీ) నేరుగా యజమాని ఇంటికి స్పీడ్ పోస్టులో వచ్చేస్తుంది. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇక నుంచి రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం కొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. వాహనం కొనుగోలు చేసిన షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తరువాత రిజిస్ట్రేషన్ కార్డు నేరుగా ఇంటికే పోస్టులో వచ్చేలా ఏర్పాట్లు చేసారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాహన్, సారథి పోర్టళ్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో సగటున ఏటా 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్లు రిజిస్టర్ అవుతున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు(టీఆర్) షోరూంలోనే ఇస్తున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సైతం అక్కడే పూర్తి కానుంది.
తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి వాహనాన్ని విక్రయించిన డీలరే.. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాల(ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు)ను అప్లోడ్ చేశాక.. రవాణా శాఖ అధికారి నంబరు కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేస్తారు. వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబరు కావాలంటే మాత్రం రవాణా శాఖ అధికారులు ఆ సిరీస్ విడుదల చేసే వరకు వేచి ఉండాలి.
నూతన విధానంతో రవాణా శాఖ కార్యాలయంలో స్లాట్ బుకింగ్, క్యూ లైన్లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి కానుంది. కాగా, వాణిజ్య వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications