• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బదిలీపై వెళ్తున్న పోలీస్ బాస్ తరుణ్ జోషికి, కన్నులపండుగలా వరంగల్ పోలీసుల ఘన వీడ్కోలు!!

|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ పోలీస్ కమీషనరేట్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నిన్నటివరకు వరంగల్ పోలీస్ కమీషనర్ గా పనిచేసిన తరుణ్ జోషి బదిలీపై వెళ్తున్న క్రమంలో నెవ్వర్ బిఫోర్ అన్న చందంగా పోలీస్ బాస్ కు గ్రాండ్ గా వీడ్కోలు పలికారు వరంగల్ పోలీస్ కమీషనరేట్ పోలీసులు. పోలీసులు ఇచ్చిన వీడ్కోలు ఆయనను ఉద్వేగానికి గురి చేసింది.

అందరితో సూపర్ పోలీస్ అనిపించుకున్న పోలీస్ బాస్ తరుణ్ జోషి

అందరితో సూపర్ పోలీస్ అనిపించుకున్న పోలీస్ బాస్ తరుణ్ జోషి

పోలీస్ అధికారుల బదిలీలు సహజంగా జరుగుతూ ఉంటాయి. బదిలీ జరిగినప్పుడల్లా ఇతర ప్రాంతాలకు వెళ్లి విధి నిర్వహణలో తమవంతు పాత్ర పోషిస్తారు పోలీసులు. వారి పనితీరును బట్టి, క్రింది స్థాయి సిబ్బందితో, ప్రజలతో వారు కొనసాగించిన సత్సంబంధాలను బట్టి ఆయా జిల్లాల వాసులు, పోలీసు శాఖలో పనిచేసిన ఉద్యోగులు వారిని గుర్తుంచుకుంటారు. కానీ అంతకుమించి అందరి గుండెల్లో గూడు కట్టుకునే గొప్ప పోలీస్ బాస్ లు కూడా ఉంటారు అని కొందరు నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన వారే వరంగల్ పోలీస్ కమీషనర్ గా పని చేసి ఇటీవల బదిలీపై డీజీపీ ఆఫీస్ కు వెళ్ళిన డా. తరుణ్ జోషి.

తరుణ్ జోషికి ఘనంగా వీడ్కోలు

తరుణ్ జోషికి ఘనంగా వీడ్కోలు

తరుణ్ జోషి వరంగల్ పోలీస్ కమీషనరేట్ లో తన మార్క్ పాలన సాగించారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తూ, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణలో రాజీపడకుండా, సిబ్బంది కి ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ అండగా ఉండి బాస్ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా తనదైన మార్క్ పాలన చేశారు తరుణ్ జోషి. ఇక తాజాగా ఆయన బదిలీ నేపథ్యంలో ఆయనకు ఊహించని విధంగా సెండాఫ్ ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు పోలీసు అధికారులు.

పూల వాహనంలో తరుణ్ జోషి .. పోలీసుల గౌరవ వందనం

పూల వాహనంలో తరుణ్ జోషి .. పోలీసుల గౌరవ వందనం

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డీజీపీ కార్యాలయమునకు బదిలీపై వెళ్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి గౌరవార్ధం ఆర్మూడ్ రిజర్వ్ విభాగం పోలీసులు వీడ్కోలు పరేడు నిర్వహించారు. ఆర్మూడ్ రిజర్వ్, సివిల్, ట్రాఫిక్, హోంగార్డ్ పోలీస్ సిబ్బంది ఖవాతు నిర్వహించారు. అనంతరం సత్కరించడంతో పాటు జ్ఞాపికను అందజేసారు. ఆయనను భుజాలపై ఎత్తుకుని ఊరేగించారు. బదిలీపై వెళ్తున్న తరుణ్ జోషికి డిసిపి స్థాయి అధికారి మొదలలుకోని హోంగార్డు సిబ్బంది వరకు పూలతో అందంగా అలంకరించిన ఆయన వాహనాన్ని త్రాడుతో లాగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్తున్న వాహనానికి పూలతో చక్కగా డెకరేట్ చేసి ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

పూల వాహనాన్ని తాళ్ళతో లాగుతూ పూలు చల్లుతూ పోలీసుల వీడ్కోలు

పూల వాహనాన్ని తాళ్ళతో లాగుతూ పూలు చల్లుతూ పోలీసుల వీడ్కోలు

ఆయన నిలుచున్న పోలీసు వాహనాన్ని తాళ్లతో లాగుతూ దారిపొడవునా పువ్వులను చల్లుతూ సాదరంగా వీడ్కోలు పలికారు. ఎంతో ప్రేమ, ఆప్యాయతలతో తనకు వీడ్కోలు చెప్పిన అధికారులకు పేరుపేరునా కరచాలనం చేసి అందరికీ రెండు చేతులెత్తి నమస్కరించారు తరుణ్ జోషి. తన పట్ల ఎంతో ప్రేమను చూపించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన పోలీస్ కమీషనర్ గా పని చేసిన కాలంలో తనకు సహకరించిన అందరు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సీపీ తరుణ్ జోషి సంతోషం.. పోలీసులకు దిశా నిర్దేశం

సీపీ తరుణ్ జోషి సంతోషం.. పోలీసులకు దిశా నిర్దేశం

వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి సహకారం అందించడం ద్వారా పోలీస్ కమిషనర్ గా తాను రాణించగలిగాను అని పోలీస్ కమిషనర్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో, బందోబస్తులు, లాక్ డౌన్ సమయంలో అందరూ బాగా పని చేశారన్నారు. ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేకతని చాటుకున్నారన్నారు.

రానున్న రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన భవన నిర్మాణం పూర్తి అవుతుందని, పోలీసులు తమ విధుల్లో రాణించే విధంగా మౌలిక సదుపాయాలు కూడా పెరిగాయని చెప్పారు. మేడారం జాతర విధులు నిర్వర్తించటం మనసులో ఉండిపోతుందని అన్నారు. ప్రజల ఆశయాలకు తగ్గట్లుగా విధులు నిర్వహించడం ద్వారా ప్రజలకు పోలీసులపై గౌరవం, నమ్మకం పెరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

English summary
Warangal Police gave a grand farewell to Police Boss Tarun Joshi who is going on transfer. They showed their admiration by pulling his vehicle, which was beautifully decorated with flowers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X