వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధరలు తగ్గించం కానీ: జీఎస్టీ తగ్గింపుపై వ్యాపార సంస్థల కొత్త మెలిక

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: వినియోగదారులకు ఊరట కలిగించేలా వస్తు సేవల పన్ను (జిఎస్టీ) కింద నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించారు. ధరలు తగ్గించే విషయంలో వ్యాపార సంస్థలు మాత్రం ఓ మెలిక పెడుతున్నాయి.

28 శాతం శ్లాబులో ఉన్న 178 నిత్యావసర వస్తువులను అంతకు తక్కువ శ్లాబులకు మార్చారు. ఈ మేరకు జీఎస్టీ మండలి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలని ఆయా కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.

 ధరలు తగ్గించం కానీ పరిమాణం పెంచుతాం

ధరలు తగ్గించం కానీ పరిమాణం పెంచుతాం

అందుకు అనుగుణంగానే కొన్ని కంపెనీలు తమ వస్తువులపై ధరలను తగ్గించనున్నట్లు చెప్పాయి. కొన్ని కంపెనీలు మాత్రం ధరలను తగ్గించబోమని చెబుతున్నాయి. ధరలు తగ్గించే బదులు అందుకు మరో మార్గం సూచిస్తున్నాయి. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు చేర్చేందుకు అదే ధరలకు ఎక్కువ వస్తువులు ఇస్తామని చెబుతున్నాయి.

 ధరలు మార్పు చేయకుండా ఈ కంపెనీలు

ధరలు మార్పు చేయకుండా ఈ కంపెనీలు

ఆయా వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు చేయకుండా వస్తువుల పరిమాణం పెంచేందుకు కొన్ని కంపెనీలు సిద్ధమని చెప్పాయి. బోర్నవిటా, క్యాడ్బరీ, ఓరియో, హిందుస్థాన్‌ యునిలివర్‌ లాంటి సంస్థలు ఈ ఫార్ములాను పాటిస్తున్నట్లు చెప్పాయి.

 ఇలా పెంచుతాం

ఇలా పెంచుతాం

తమ వస్తువుల ధరలలో ఎలాంటి మార్పులు చేయకుండా వాటి పరిమాణాన్ని పెంచుతామని అవి తెలిపాయి. 125 గ్రాముల రిన్‌ సబ్బు ధర రూ. 10గా ఉంది. జీఎస్టీ తగ్గించిన తర్వాత అదే రూ. 10కి 140 గ్రాముల సబ్బును విక్రయిస్తామని హిందుస్థాన్‌ యూనిలివర్‌ చెబుతోంది.

 ఇలా ధరలు

ఇలా ధరలు

దీని వల్ల కస్టమర్లు మార్పును సులభంగా గుర్తించే అవకాశముంటుందని అంటున్నారు. తమ ఉత్పత్తుల ధరలు రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.15.. ఇలా వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయని, కాబట్టి పరిమాణం పెంచుతామని చెబుతున్నారు.

English summary
The next time you visit the market to shop for your daily essentials, you may see bigger pack sizes at the same price as some consumer goods companies are planning to increase the weight of their products to pass on gains from revised GST rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X