మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు- డ్రగ్స్ పార్టీలో ఉన్నది వీళ్లే
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ లో ఓ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కలకలం చెలరేగింది. ఇది అక్కడితో ఆగిపోలేదు. కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కొకైన్, ఓ రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందినది కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అరెస్టయిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు తెలుస్తోంది. మొయినాబాద్ అజీజ్ నగర్ లో గల ఓ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో మొదట ఈగల్ టీమ్ సిబ్బంది ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. నిర్వాహకులు వారిని అడ్డుకున్నారు. తనిఖీ చేయడానికి అంగీకరించలేదు. లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఎస్ఓటీ అధికారులను పిలిపించారు.

ఎస్ఓటీ టీమ్, పోలీసులు వచ్చిన తర్వాత సోదాలు ముమ్మరం అయ్యాయి. ఎస్ఓటీ, ఈగల్ టీమ్, పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చుట్టుముట్టిన పోలీసులను చూడగానే.. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారు ఒక రౌండ్ పాటు గాలిలో కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది. అరెస్టయిన వారిలో కొందరి బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షించగా.. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఫామ్ హౌస్ నుంచి కొకైన్, రివాల్వర్, ఇతర మత్తు పదార్థాలు, అనుమతి లేకుండా వినియోగిస్తోన్న బల్క్ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ పార్టీకి కొందరు వీఐపీ అతిథులు హాజరైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Rangareddy: Based on information that a party was being held at a farmhouse without permission, the police conducted a raid at around 9:30 pm. Upon arrival, Delhi-based real estate businessman Namit Sharma fired one round from a gun. The gun, belonging to Ritesh Reddy, the…
— ANI (@ANI) March 15, 2026
వారిలో ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు కూడా ఉండటం రాజకీయంగా దుమారానికి దారి తీసింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మరికొందరు అనుమానితులను ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరోసారి తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పౌరులు సమాచారం ఇవ్వాలని కోరారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications