వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరులో టిక్కెట్ల కోసం పోటాపోటీ: ఆ సీట్లలో టిక్కెట్లు ఎవరికీ?

ఇతర పార్టీల నుండి చేరిన నేతలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును కోరుతూ మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుండే పోటీ పడుతున్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన

By Narsimha
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: ఇతర పార్టీల నుండి చేరిన నేతలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును కోరుతూ మొదటి నుండి పార్టీలో ఉన్న నేతలు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుండే పోటీ పడుతున్నారు.అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే మహబూబ్ నగర్ జిల్లాలోని టిఆర్ఎస్ నేతలకు ఎవరికి టిక్కెట్లు దక్కుతాయో తేలని పరిస్థితి నెలకొంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బంగారు తెలంగాణ కోసం ఇతర పార్టీల నుండి ముఖ్యమైన నేతలను ప్రజాప్రతినిధులను టిఆర్ఎస్ తమ పార్టీలోకి చేర్చుకొంది.దీంతో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టిఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యేలే కాకుండా ముఖ్యమైన నేతలు కూడ టిఆర్ఎస్‌లో చేరారు.

టిఆర్ఎస్‌లో ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరేసి నేతలు ఉన్న నియోజకవర్గాలు కూడ లేకపోలేదు. అయితే 2019 ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు దక్కుతాయోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.2014 ఎన్నికల్లో వేరే పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారు ప్రస్తుతం టిఆర్ఎస్‌లో కొనసాగుతుండడం కూడ ఇబ్బందులను సృష్టించింది.

నారాయణపేటలో నేతల మద్య అగాధం

నారాయణపేటలో నేతల మద్య అగాధం


2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా రాజేందర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఏడాది క్రితం రాజేందర్ రెడ్డి టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.అయితే గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం నుండి శివకుమార్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే రాజేందర్ రెడ్డి, శివకుమార్ మధ్య అగాధం ఉంది. నారాయణపేటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ స్వయంగా శివకుమార్‌కు తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఇటీవలే హమీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి శివకుమార్‌కు టిఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించే పరిస్థితి ఉంటుందా, ఎన్నికల నాటికి శివకుమార్‌కు నామినేటేడ్ పదవిని కట్టబెట్టనున్నారా అనే విషయమై చర్చ సాగుతోంది.

మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి అనుకూలమేనా

మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి అనుకూలమేనా

2014లో మక్తల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో మక్తల్ నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్లారెడ్డి బరిలోకి దిగారు. ఆయన టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్‌లో చేరిన తర్వాత మక్తల్ నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఓటమి పాలయ్యారు. కొంతకాలానికి ఎల్లారెడ్డి చనిపోయారు. అయితే ఎల్లారెడ్డి పార్టీలో చేరడానికి ముందు ఈ నియోజకవర్గానికి ఇంచార్జీగా దేవర మల్లప్ప కొనసాగారు. చిట్టెం రామ్మోహన్‌రెడ్డికే వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ టిక్కెట్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దేవర మల్లప్పకు నామినేటేడ్ పదవిని కట్టబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది.

నాగర్‌కర్నూల్ ఎంపీకి పోటాపోటీ

నాగర్‌కర్నూల్ ఎంపీకి పోటాపోటీ


నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీ ఎక్కువగా ఉందనే ప్రచారం కూడ టిఆర్ఎస్‌లో సాగుతోంది. టిడిపిని వీడి మాజీ మంత్రి పి. రాములు టిఆర్ఎస్‌లో చేరారు.అయితే అచ్చంపేట నుండి టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.గతంలో మందా జగన్నాథం ఈ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. ఆలంపూర్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా రాములు లేదా మందా జగన్నాథం లలో ఎవరైనా బరిలోకి దింపే అవకాశం కూడ లేకపోలేదు. అయితే జగన్నాథంను ఆలంపూర్ అసెంబ్లీ నుండి బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది. ఆలంపూర్ నుండి మంద జగన్నాథం బరిలోకి దిగితే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి పి.రాములు బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.

కల్వకుర్తిలో ముగ్గురి నేతల మధ్య పోటీ

కల్వకుర్తిలో ముగ్గురి నేతల మధ్య పోటీ

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన జైపాల్‌యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ విజితారెడ్డి మూడు వర్గాలుగా నియోజకవర్గంలో రాజకీయాలు నడుపుతున్నారు. ఈ ముగ్గురు నేతలూ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అయితే ఎవరికీ టిక్కెట్టు లభిస్తోందనే విషయమై గందగగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లాభమే

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లాభమే

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే టిఆర్ఎస్‌కు, ఏపీలో టిడిపికి రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదు. అయితే ఈ విషయమై ఇటీవల కేంద్రంలో మరోసారి కదలిక వచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రానున్న ఎన్నికల్లో నేతలకు సీట్లను సర్ధుబాటు చేసే అవకాశాలు మెరుగయ్యే అవకాశాలుంటాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అదే జరగకపోతే కొంత ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

English summary
Huge competition between TRS leaders for contesting in Mahabubnagar district for 2019 elections.Trs leaders competition for tickest from Kalwakurthy,Narayanapeta, Achampeta assembly segments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X