హెల్మెట్ లేకుండా రోడ్డుపైకి.. 41 లక్షల కేసులు నమోదు..
హైదరాబాద్ పోలీస్ వార్షిక నివేదికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక నివేదిక-2025 ను డిజిటల్ పద్ధతిలో ఆవిష్కరించారు. ఎకో- ఫ్రెండ్లీ విధానంలో, ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా ఈ నివేదికను రూపొందించినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ లో నేరాలు 15 శాతం తగ్గాయని.. అలాగే మహిళలపై నేరాలు 6 శాతం పెరిగాయని సజ్జనార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో నేరాలు 15 శాతం తగ్గినట్లు పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ తెలిపారు. మహిళలపై నేరాలు 6 శాతం పెరిగినట్లు స్పష్టం చేశారు. 405 అత్యాచారం, 119 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు వివరించారు. తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల నుంచి గ్యాంగ్ లు రావాలంటే భయపడుతున్నాయని సీపీ సజ్జనార్ అన్నారు. అలాగే నగరంలో ఎక్కడ దొంగతనం జరిగినా పట్టుకుంటారనే భయం దొంగల్లో ఏర్పడిందని.. ఈ మేరకు 566 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక నివేదిక-2025లో వెల్లడించారు. అంతేకాక సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తున్నట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఇక గతేడాదితో పోలిస్తే నగరంలో వాహన రద్దీ పెరిగినప్పటికీ, పటిష్ట చర్యలతో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీస్ వార్షిక నివేదిక- 2025 ప్రకారం.. ట్రాఫిక్ విభాగ గణాంకాలను పరిశీలిస్తే వాహనదారుల వైఖరిలో ఆశించిన మార్పు కనిపించడం లేదని స్పష్టం అవుతోందన్నారు. ప్రధానంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన కేసులు 41 లక్షలు దాటడం ఆందోళనకరంగా ఉందన్నారు.

ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ఉల్లంఘనలు భారీగా పెరిగినట్లు తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన కేసులు 41 లక్షలకు పైగా ఉండటం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 6 లక్షలకు పైగా కేసులు, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ 2 లక్షల 34 వేలు, ట్రిపుల్ రైడింగ్ లక్షా 75 వేలు, సిగ్నల్ జంపింగ్ లక్షా 52 వేలకు పైగా కేసులు నమోదైనట్లు సీపీ సజ్జనార్.. హైదరాబాద్ పోలీస్ వార్షిక నివేదిక- 2025 లో తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications