వేడెక్కించిన రేవంత్ నిర్ణయాలు: ఆయన అసెంబ్లీ లాబీల్లో చర్చ ఇలా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వారం క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన అసెంబ్లీ లాబీల్లో చర్చ సాగుతోంది. సోమవారం ఎమ్మెల్యేల మధ్య ఆయన గురించి ఆసక్తికర చర్చ సాగింది.

అంతుందా?: షాకిచ్చిన అనుచరులు, రేవంత్ దూకుడుకు కాంగ్రెస్ ఝలక్

Big Shock To Revanth Reddy రేవంత్‌కు బిగ్ షాక్ | Oneindia Telugu

రేవంత్ గురించి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే సంపత్‌ సరదాగా ముచ్చటించుకున్నారు. కాంగ్రెస్‌లో రేవంత్ పొజిషన్ ఏమిటి, పార్టీ లీడరా.., వర్కరా? అని సంపత్‌ని అక్బర్‌ అడిగారు.

ఆ తర్వాతే రేవంత్‌కు పదవి, వ్యూహం మార్చిన కాంగ్రెస్: రేణుకా చౌదరితో భేటీ

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ జవాబు

కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ జవాబు

ప్రస్తుతానికి రేవంత్ పార్టీ వర్కర్ అని సంపత్ జవాబిచ్చారు. సభలో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదని, సభ తీరుపై తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, కాంగ్రెస్ సభ్యులు మౌనంగా కూర్చున్నారని అక్బర్ అన్నారు.

 రేవంత్ వల్ల ఎలాంటి మార్పు రాదు

రేవంత్ వల్ల ఎలాంటి మార్పు రాదు

మరోవైపు కాంగ్రెస్‌లో మహామహులే చేరారు, రేవంత్‌ ఎంత అని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌ వ్యాఖ్యానించారు. రేవంత్‌లాంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పు రాదని ఆయన ఎద్దేవా చేశారు.

రేవంత్ వరుస నిర్ణయాలతో వేడెక్కిన రాజకీయం

రేవంత్ వరుస నిర్ణయాలతో వేడెక్కిన రాజకీయం

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా లేఖను ఇచ్చారు. రేవంత్ తన నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

 రేవంత్ నిర్ణయాలు

రేవంత్ నిర్ణయాలు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన తనకు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అక్కడ ఎస్పీ కార్యాలయంలో ఆర్‌ఐ క్రాంతి కుమార్‌కు గన్‌మెన్ల సరెండర్ లేఖను అందించి, గన్‌మెన్లను అప్పగించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Interesting debate about Kodangal MLA Revanth Reddy in Assembly lobby on Monday.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి