సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగ స్పెషల్ ట్రైన్- హాల్ట్ స్టేషన్లు
Secunderabad- Sapta Jyotirlinga special train: ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణ- ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. సప్త జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ ఇది. మొత్తం ఏడు జ్యోతిర్లింగాలను ఇందులో చేర్చింది ఐఆర్సీటీసీ. ఉజ్జయినీ, ద్వారకా వంటి ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇందులో ఉన్నాయి.
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. మొత్తం 10 రాత్రులు/ 11 పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది. 2026 ఫిబ్రవరి 6 తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళుతుంది. మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్- 237, 3ఏసీ- 416, 2ఏసీ- 52.

సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్‌కు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, హుజూర్ సాహెబ్ నాందెడ్, పూర్ణ స్టేషన్లలల్లో హాల్ట్ సౌకర్యం ఉంటుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.
ఉజ్జయినీలో వెలిసిన మహాకాలేశ్వర, ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు ఈ ప్యాకేజీ ద్వారా. గుజరాత్ లోని ద్వారకలో సోమనాథేశ్వరుడిని సేవించవచ్చు. ప్రత్యేక పూజల్లో పాల్గొనవచ్చు. తిరుగు ప్రయాణంలో నాసిక్‌లో ప్రఖ్యాత త్రయంబకేశ్వరుడి ఆలయం, పుణేలో భీమశంకర జ్యోతిర్లింగం, ఔరంగాబాద్‌లో ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం ఈ ప్యాకేజీలో ఉంది.
ఈ టూర్ ప్యాకేజీ ద్వారా పంచ జ్యోతిర్లింగాలను దర్శించుకోదలిచిన వాళ్లు ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 17,600 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 16,300 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ)లో పెద్దలకు 26,700, పిల్లలకు 25,200 రూపాయలు, కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ)లో పెద్దలకు 34,600, పిల్లలకు 32,800 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications