వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యమాలవల్లే తెలంగాణ రాలేదు, సీఎం పదవే వదిలేశా: కెసిఆర్‌కు జానా సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత, ఆ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం వరంగల్ బహిరంగ సభలో కెసిఆర్ తన పైన చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

నిన్న వరంగల్ సభలో కెసిఆర్ చెప్పినవన్నీ అబద్దాలు అన్నారు. మంత్రి పదవి కోసం తాను తెలంగాణ ఫోరం పెట్టానని చెప్పడం సరికాదన్నారు. ఇతరుల స్థాయి తగ్గించేలా మాట్లాడొద్దన్నారు. తెలంగాణ కోసం తాము ఎంతో కృషి చేశామని, సోనియాను ఒప్పించామన్నారు.

కెసిఆర్ చెప్పినవి అన్నీ అబద్దాలే అన్నారు. పదవుల కోసం తాను ఏనాడు పాకులాడలేదని, ఎవరినీ అడగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే తన పార్టీని అందులో కలిపేస్తానని కెసిఆరే చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. ఎవరు అబద్దాలు ఆడుతున్నారో తెలంగాణ మేథావులు గుర్తించాలన్నారు.

Jana Reddy counter to CM KCR

టిఆర్ఎస్ గొడవలు, ఉద్యమాల వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల వల్లే వచ్చిందన్నారు. మూడేళ్లలో సాగునీరు ఇస్తే తాను కెసిఆర్‌కు ప్రచారకర్తగా పని చేస్తానని లేదంటే కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తారా అని సవాల్ చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చిందని, కానీ తెలంగాణ కోసం తాను దానిని వదులుకున్నానని చెప్పారు. అధికార అహంకారులకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ విషయంలో తన చిత్తశుద్ధిని శంకించొద్దన్నారు.

దామోదర రాజనర్సింహ మండిపాటు

జైపాల్ రెడ్డి, జానా రెడ్డిల పైన కెసిఆర్ వ్యాఖ్యలు సరికాదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. కెసిఆర్ పాలన రాచరికాన్ని తలపిస్తోందన్నారు. కెసిఆర్ పాలనలో దొరలకు ఓ న్యాయం, దళితులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. కెసిఆర్‌ను రాళ్లతో కొట్టాలా, లేదా పాతరేయాలా ప్రజలు ఆలోచిస్తారని చెప్పారు. వాటర్ గ్రిడ్ పథకంలో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. మట, మూట, వేట.. ఇది కెసిఆర్ సిద్ధాంతమన్నారు. కెసిఆర్‌కు నిన్న చెప్పులు చూపారని, రేపు రాళ్లు విసురుతారన్నారు.

English summary
Telangana Congress MLA Jana Reddy on Wednesday lashes out at CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X