వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశీయ చందస్సులకు తెలంగాణే జన్మభూమి: తెలుగు మహాసభలపై కేసీఆర్..

తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆది అని అందుకు ఉదాహరణలు వివరించారు. తొలి స్వతంత్ర రచన బసవ పురాణం, తెలుగులో తొలి శతకం వృషాధిప శతకము పాల్కురికి సోమన రచించిన కావ్యరత్నాలు అని గుర్తుచేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

CM KCR Excellent Speech Over World Telugu Conference | Oneindia Telugu

హైదరాబాద్: భాషపై ఉన్న పట్టుతోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటి వాక్చాతుర్యాన్ని సంపాదించారన్నది సుస్పష్టం. సామెతలైనా.. నుడికారాలైనా.. పిట్ట కథలైనా సందర్భానుసారం ప్రసంగాల్లో ఉపయోగించడంలో.. ప్రజలకు కమ్యూనికేట్ చేయడంలో ఆయన ధిట్ట.

కేసీఆర్ భాష ఔన్నత్యాన్ని మరోసారి తెలియజెప్పే సన్నివేశం అసెంబ్లీలో చోటు చేసుకుంది. వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తుండటంతో.. సీఎం అసెంబ్లీలో దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష చరిత్రను, దాని గొప్పతనాన్ని ఆయన తెలియజెప్పారు.

సాహితీ వైభవాన్ని చాటడం కోసమే:

సాహితీ వైభవాన్ని చాటడం కోసమే:

తెలంగాణ భాష ప్రాభవం గురించి కేసీఆర్ సభలో వివరించారు. ఈ సందర్భంగా హాలుడు రచించిన 'గాధా సప్తశతి'లోని పద ప్రయోగాల గురించి అనర్గళంగా మాట్లాడారు.

'తెలంగాణలో పరిఢవిల్లిన సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలన్న ఆశయంతో ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం ఉన్న భాషగా తెలుగు భాష కీర్తి పొందింది. నికోలస్ కోర్టీ అనే పాశ్చాత్య పండితుడు తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా కొనియాడారు.' అని తెలిపారు.

సుందర తెలుంగు:

సుందర తెలుంగు:

తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి, తెలుగును 'సుందర తెలుంగు' అని కీర్తించారని కేసీఆర్ గుర్తుచేశారు. మన తెలంగాణ ప్రాచీన కాలం నుంచి తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం అన్నారు. చరిత్రకు అందినంతవరకూ తెలంగాణలో 2 వేల సంవత్సరాలకు పూర్వమే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయన్నారు.

హాలుని 'గాధా సప్తశతి':

హాలుని 'గాధా సప్తశతి':

క్రీ.శ 1వ శతాబ్దానికి చెందిన హాలుని గాధా సప్తశపతిలో మన తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయని కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కురుక్యాల వద్ద బొమ్మలగుట్టపై ఉన్న చిన్న మల్లకుని శాసనం, కంద పద్యాలలో ఉండటం విశేషం అని పేర్కొన్నారు. దీన్నిబట్టి క్రీ.శ 9వ శతాబ్దం నాటికే తెలంగాణలో చందోబద్ద సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెబుతోందన్నారు.

దేశీయ చందస్సులకు తెలంగాణే జన్మభూమి:

దేశీయ చందస్సులకు తెలంగాణే జన్మభూమి:


వెలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ చందస్సులకు తెలంగాణనే జన్మభూమి అని కేసీఆర్ తెలిపారు. గురుతర గద్య పద్యోక్తుల కన్న సరసమైన తెలుగు మనది అని కొనియాడారు. అచ్చతెలుగు పలుకుబడికి పట్టంగట్టిన పాల్కురికి సోమ నాథుడు, మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి అని గుర్తుచేశారు.

తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆది అని అందుకు ఉదాహరణలు వివరించారు. తొలి స్వతంత్ర రచన బసవ పురాణం, తెలుగులో తొలి శతకం వృషాధిప శతకము పాల్కురికి సోమన రచించిన కావ్యరత్నాలు అని గుర్తుచేశారు. తొలిగా సోమన చేసిన సాహిత్య ప్రయోగాలే తరువాతి కాలానికి తెలుగు భాషకు ప్రామాణికాలు అంటూ కేసీఆర్ తెలుగు భాషా విశిష్టతను చాటిచెప్పారు.

గాధా సప్తశతి సహా పలు కావ్యాల్లోని పద ప్రయోగాలను గుర్తు చేశారు. ఈ సభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

English summary
During the assembly sessions Telangana CM KCR explained about World Telugu Conference-2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X