కేంద్రంపై పోరులో కేసీఆర్ బిగ్గెస్ట్ స్కెచ్... కేంద్ర ప్రభుత్వోద్యోగులు, దర్యాప్తు సంస్థల అధికారులకు షాక్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు, ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ దాడుల నేపథ్యంలో కేంద్రంపై పోరుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న కేసీఆర్ బిగ్గెస్ట్ డెసిషన్ తీసుకున్నారు. కేంద్రంపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని కెసిఆర్ ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగించనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎరకేసులో తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నేతలను కూడా టార్గెట్ చేసుకోనున్నారు.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై కేసీఆర్ అస్త్రం
సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరు ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై నజర్ పెట్టిన కెసిఆర్ ఈ క్రమంలో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాబితాను రెడీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిలో లంచావతారాలను గుర్తించి వారిని లక్ష్యంగా చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక ఈడి, ఐటి అధికారులు విచారణలో భాగంగా ఎవరి పైన అయినా చేయి చేసుకున్నా కేసులు నమోదు చేయాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఏసీబీని రంగంలోకి దించనున్న కేసీఆర్ .. డార్క్ రూమ్ దాడులపైనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు, ముఖ్య నాయకులు, వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు టార్గెట్ గా సాగుతున్న ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో ఏసీబీ ని రంగంలోకి దించాలని నిర్ణయించిన కేసీఆర్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ డి, ఐటీ దాడుల నేపథ్యంలో డార్క్ రూమ్ దాడుల పైన కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడానికి ఏసీబీకి ఉన్న అధికారాలు, ఆ తర్వాత దశలో కేసు విచారణ చేయడానికి అనుమతి తీసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై చర్చించారు.

కేంద్ర ప్రభుత్వోద్యోగులపై ఫిర్యాదులు అందితే దాడులు.. కేసులే
ఇక తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదులు అందితే తక్షణం వారిపై దాడి చేసి కేసులు నమోదు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏసీబీకి ప్రభుత్వం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులపైన కూడా ఫోకస్ చేయనున్న కేసీఆర్, కేంద్రం, ఏ విధంగా అయితే దర్యాప్తు సంస్థలతో టిఆర్ఎస్ పార్టీ మీద ఒత్తిడి పెడుతుందో, బీజేపీ లో ఉన్న కీలక నాయకులను అదేస్థాయిలో ఎమ్మెల్యేల ఎరకేసుతో పాటు, రకరకాల కేసులలో ఒత్తిడికి గురి చేయాలని నిర్ణయించినట్లు గా సమాచారం.

కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపైనా ఫిర్యాదులు అందితే కేసులే..
ఏదేమైనా దెబ్బకు దెబ్బ తీయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ఆ దిశగా న్యాయనిపుణులతో చర్చించి కేంద్రంలోని అధికార బీజేపీ ని ఇరకాటంలో పెట్టేందుకు బడా వ్యూహాన్ని రచించారు. ఇక తాజాగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులను పలువురుని చీకటి గదిలోకి తీసుకు వెళ్లి అధికారులు చేయి చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల పైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయించాలని తెలంగాణ సర్కార్ రెడీ అవుతోంది. మొత్తానికి కేంద్రంలోని బిజెపి రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తూ సాగించే సమరంలో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications