వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంటగెలిచి రచ్చ గెలవాలంటున్న కేసీఆర్.. బీఆర్ఎస్ పై సందిగ్ధం; జిల్లాల పర్యటనతో రంగంలోకి గులాబీబాస్

|
Google Oneindia TeluguNews

జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న కెసిఆర్ త్వరలో బిఆర్ఎస్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో పట్టు తప్పితే జాతీయ రాజకీయాలలో సైతం జీరో గా మారతాము అన్న ఆందోళనలో ఉన్నారని తెలుస్తుంది. అందుకే ముందు తెలంగాణ రాజకీయాలలో , టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికలలో విజయం సాధించే దిశగా ఫోకస్ చేయాలని కెసిఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.

ఇంట గెలిచి రచ్చ గెలవాలని కేసీఆర్ ఫోకస్

ఇంట గెలిచి రచ్చ గెలవాలని కేసీఆర్ ఫోకస్

తెలంగాణ సీఎం కేసీఆర్ బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాటం చేయాలని సొంత జాతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన చేశారు. దాదాపు అన్నీ సిద్ధం చేసుకున్నా, ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రకటన చెయ్యలేదు. అందుకు కారణం ప్రస్తుత పరిస్థితులు కేసీఆర్ పార్టీ ప్రకటనకు అనుకూలంగా లేవు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు బీజేపీని వ్యతిరేకిస్తారా అన్నది కూడా చూసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దాలని, ఇంట గెలిచి రచ్చ గెలవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితిని చక్కదిద్దకపోత మొదటికే మోసం వస్తుందని కెసిఆర్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

జాతీయ పార్టీ పెట్టే కంటే ముందు రాష్ట్రంలో పరిస్థితి చక్కదిద్దాలని కేసీఆర్ పాట్లు

జాతీయ పార్టీ పెట్టే కంటే ముందు రాష్ట్రంలో పరిస్థితి చక్కదిద్దాలని కేసీఆర్ పాట్లు


ఇటీవల చూస్తే కెసిఆర్ యశ్వంత్ సిన్హా వచ్చినప్పుడు నిర్వహించిన సభలో తప్ప బయట ఎక్కడా కనిపించలేదు. జాతీయ పార్టీ ఏర్పాటు కోసం సీరియస్ గా వర్కౌట్ చేస్తున్న కెసిఆర్, ప్రస్తుతం రాష్ట్రంలో మారుతున్న పరిణామాలను కూడా అంచనా వేసే పనిలో పడ్డారు. ముందు రాష్ట్రంలో పట్టు కోల్పోతే దేశంలో ఎవరూ పట్టించుకోరు అన్న భావనలో కెసిఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి కేటీఆర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయకుంటే వచ్చే ఎన్నికలలో దెబ్బ తింటామన్న ఆలోచనలో కెసిఆర్ ఉన్నట్టు సమాచారం.

కాంగ్రెస్, బీజేపీ లకు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహం

కాంగ్రెస్, బీజేపీ లకు చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహం

ఒకపక్క బిజెపి అగ్రనేతలను రంగంలోకి దింపి పార్టీ మైలేజ్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ చేరికలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంది. ఇక ఈ సమయంలో ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి అధికార బలంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, నియోజకవర్గాల వారీగా బలమైన నేతల చేరికలకు పార్టీ శ్రేణులు పని చేయాలని ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నేతలు పార్టీ కోసం పని చేసే బలమైన నేతల చేరిక కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అదును చూసి ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు.

కేసీఆర్ జిల్లాల పర్యటన .. హామీలను నెరవేర్చటంపై ఫోకస్

కేసీఆర్ జిల్లాల పర్యటన .. హామీలను నెరవేర్చటంపై ఫోకస్


ఇక ఇదే సమయంలో కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని సమాచారం. ఈనెల 20 వ తేదీ తర్వాత జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపాలని భావిస్తున్నారు. అలాగే పార్టీ లో ఉన్న అంతర్గత కలహాలకు చెక్ పెట్టి దిద్దుబాటు ప్రయత్నాలు చెయ్యనున్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన అన్ని హామీలపై పూర్తిగా ఫోకస్ చేసి మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి అన్ని హామీలు నేరవేర్చామన్న భావన కలిగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో తెలంగాణా ధరణి పోర్టల్ వల్ల తలెత్తిన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కూడా పెట్టాలని కేసీఆర్ దృష్టి సారించారని తెలుస్తుంది.

అధికారం నిలబెట్టుకోవటం కోసం కేసీఆర్ ఎత్తుగడలు

అధికారం నిలబెట్టుకోవటం కోసం కేసీఆర్ ఎత్తుగడలు

అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ముందు దృష్టి సారించాలని కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణలో పట్టుకోసం కెసిఆర్ అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఉద్దేశంతోనే కెసిఆర్ టిఆర్ఎస్ ను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ ప్రతిపక్షాల వ్యూహాలను గమనిస్తూ, వాటికి చెక్ పెట్టే లాగా చాపకింద నీరులా పని చేసుకుపోవాలని సూచించినట్టు సమాచారం.

English summary
At present, in the background of developments in the state, KCR is planing strategies to put aside the BRS announcement and focus on regaining the power of the party in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X