మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ మట్టిలో పొర్లాడినా: పలకరించి, కాళ్లుమొక్కిన కెసిఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్: దుబ్బాకలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విద్య నేర్పిన గురువులు, స్నేహితులు స్థానిక బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ గురువులు గన్నె బాల్‌రెడ్డి, సి నారాయణలకు పాదాభివందనం చేశారు.

గురువులు, సన్నిహితులను ఆత్మీయంగా పలకరించి, ఆలింగనం చేసుకున్నారు. తన గురువు మృత్యుంజయ శర్మ, విద్యాబుద్ధులు నేర్పిన దుబ్బాక గడ్డను ఎప్పటికీ మరవనని చెప్పారు. మిత్రునిగా, శిష్యుడిగా శాయశక్తులా సహకరించడం తన ధర్మమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

చిన్ననాటి మిత్రులు, గురువులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వేంకటేశ్వరాలయ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే కామన్‌గుడ్ ఫండ్ కింద ఇచ్చిన రూ.2.50 కోట్లతో పాటు, అదనంగా మరో రూ.3 కోట్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

 కెసిఆర్

కెసిఆర్

దుబ్బాక అభివృద్ధి గొప్పగా లేదని తాను హెలికాప్టర్‌లో నుంచి చూస్తే అనిపించిందని, ఇందుకోసమే దుబ్బాక పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశానని, చెబుతూ గ్రామాభివృద్ధి కమిటీ వేసుకుని నిధులు వినియోగించుకోవాలని స్నేహితులు, గురువులకు సూచించారు.

కెసిఆర్

కెసిఆర్

గ్రామాభివృద్ధికి సలహాలు, సూచనలు ఇవ్వాలని గన్నె బాల్ రెడ్డి, గ్రామ పంచాయతి రిటైర్డ్ ఈవో శ్రీరాం కాశీనాథ్‌ను కెసిఆర్ కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన నక్కల పున్నారెడ్డి, వీరబత్తిని భూమయ్య, అమ్మన చంద్రారెడ్డి, బూర మల్లేశం, దుంపలపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఏవీ బాలేశం, మిత్రులు బొమ్మెర వెంకటేశం, వడ్లకొండ భద్రయ్య, తనకు సీనియర్ అయిన వడ్లకొండ దుబ్బయ్య, కొండ వేంకట నర్సయ్య, జూనియర్ అయిన ఐరేని నర్సింలు తదితరులను పేరుపెట్టి పిలుస్తూ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. పేరుపేరునా పలకరించారు.

కెసిఆర్

కెసిఆర్

మిత్రులు పొలిశెట్టి లక్ష్మీనారాయణ, చింత లక్ష్మినర్సయ్య, గొల్ల జగదీశ్వర్, గొల్ల గోపాల్, చింత గాలయ్య, నల్ల నాగరాజం, చిన్నకోడూరు భూపతి రెడ్డి, చెల్లాపూర్ నుంచి విచ్చేసిన బాల్యమిత్రులను యోగక్షేమాలు అడిగితెలుసుకున్నారు.

 కెసిఆర్

కెసిఆర్

మరోసారి వెంకటేశ్వరాలయ పూజా కార్యక్రమాలకు వస్తానని అప్పుడు ఒకరోజు ఉంటానని హామీ ఇచ్చారు. దుబ్బాకలోని మిత్రులు, గురువులతో తన వ్యవసాయ క్షేత్రంలో ఓ రోజు కలిసి భోజనం చేసి యోగక్షేమాలు మాట్లాడుకుందామని, చెప్పిన రోజు అందరూ రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

కెసిఆర్

కెసిఆర్

మన రాష్ట్రం మనకు వస్తే మన వనరులు మనకే ఖర్చవుతాయని ఉద్యమ సమయంలో చెప్పానని, ప్రస్తుతం వంద శాతం అదే జరుగుతోందని, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌ రూ. 1.60 లక్షల కోట్లని, ఇందులో ప్రణాళికేతర వ్యయం పోగా అభివృద్ధి పనుల కోసం రూ.48 వేల కోట్లు మాత్రమే అందించారని, కానీ వచ్చే బడ్జెట్‌లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల కోసమే రూ. 62 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

గతంలో 23 జిల్లాలకు ఇచ్చినదానికంటే ఇది చాలా ఎక్కువ అని కెసిఆర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధికి కనీసం పది శాతం కూడా నిధులు వెచ్చించలేదని విమర్శించారు. ఆయన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి సమీక్షలో మాట్లాడారు.

 కెసిఆర్

కెసిఆర్

పదవులు వస్తాయి, పోతాయని, గతంలోనూ చాలామందికి వచ్చాయని, కానీ ఎంతమందిని మన గుర్తుపడతామని, పదవులు కాదు గొప్పగా పని చేశామన్నదే చాలా ముఖ్యమని, అదే మనని చరిత్రలో నిలబెడుతుందని కెసిఆర్ అన్నారు. ఎక్కడి వాళ్లక్కడ పట్టుబట్టి పని చేస్తే అద్భుతాలు సాధ్యమవుతాయన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం నిధులిస్తుందని, ప్రజాప్రతినిధులు నిబద్ధతతో, చిత్తశుద్ధితో పని చేయాలని, ఇలా పని చేసినచోట ప్రజాప్రతినిధులు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. అందరూ ఐకమత్యంతో, సమన్వయంతో ముందుకు సాగితేనే దేశం బాగుపడుతుందన్నారు.

కెసిఆర్

కెసిఆర్

తొలిదశలో రాష్ట్రంలోని 10 నియోజకవర్గాలకు ఏప్రిల్‌ 30లోగా ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తామని, ఈ పనుల్ని ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షించాలని, గ్రామాల అవసరాల మేరకు పైపులు వేయించుకోవాలని, సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు చెరువులన్నింటినీ నాశనం చేశారని, వాటిని పునరుద్ధరిస్తున్నామన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

చెరువులు కలకాలం నిలిచే ప్రజా ఆస్తులని, స్థానికులు శ్రద్ధ పెట్టి వాటిని బాగుచేయించుకోవాలన్నారు. గుత్తేదారులు సరిగా చేయకపోతే అడిగి మరీ పని చేయించాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఆరాటపడ్డామని, ఇక ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాబోతోందన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

ఏప్రిల్‌ తర్వాత వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు విద్యుత్తు అందిస్తామని, 2018 నాటికి 24 గంటలూ త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా చేస్తామని, బతికినన్ని రోజులు కులం, మతం అని కొట్లాడుకుంటామని, కనీసం మరణించాకైనా సరే.. ఒకేచోట దహనం చేసేలా ప్రతి వూరిలోనూ వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలని, ఇది మనకే గౌరవమన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

తాను దేవునిబావిలో వందలసార్లు ఈత కొట్టానని, తొమ్మిదో తరగతిలో ఉండగా ఇఖ్కడే రామసముద్రం చెరువు కట్ట పైన కూర్చొని ఉత్పలమాల, చంపకమాల పద్యాలు రాశానని, ఈ మట్టిలో బోర్లాడినానని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు.

English summary
CM K Chandrashekar Rao got a bit nostalgic while recalling that the people in the district used to maintain friendly relations with officials to complete works under Janmabhoomi programme when N Chandrababu Naidu was the Chief Minister in undivided Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X