సిట్ విచారణకు హాజరు పై KCR సంచలన నిర్ణయం, కీలక పిలుపు..!!
మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణకు హాజరు పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ రెండో సారి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. రేపు (ఫిబ్రవరి 1) విచారణకు రావాలని సూచించింది. ఇందుకు సమయం.. ముహూర్తం ఖరారు చేసింది. ఇదే సమయంలో కేసీఆర్ కు నోటీసుల వేళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. న్యాయ నిపుణులతో చర్చల తరువాత కేసీఆర్ నోటీసులు.. విచారణ వేళ ఏ విధంగా వ్యవహరించాలో నిర్ణయం తీసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సిట్ నోటీసుల వేళ కేసీఆర్ హాజరు పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలో వరుసగా పార్టీ నేతలు.. న్యాయవాదులతో కేసీఆర్ కీలక చర్చలు చేసారు. అటు కేసీఆర్ కు నోటీసులు జారీ చేయటం పైన బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు (ఆదివారం) నిరసనలకు పిలుపు ఇచ్చింది. నల్లబ్యాడ్జీలు ధరించి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసనల్లో పాల్గొనాలని నిర్దేశించింది. ఇటు కేసీఆర్ విచారణకు హాజరు కానుండటం.. ఇటు నిరసనలకు పిలుపు ఇవ్వటంతో రాజకీయంగా ఉత్కంఠ కొనసాగు తోంది. ఇక, ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్.. రేపు (ఆదివారం) ఉదయమే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు.

నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు
కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. న్యాయవాదులతో చర్చించారు. నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని.. ఇంటి వద్దే విచారించాలన్న నిబంధనను దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ తన ఇంట్లోనే అధికారులకు అందుబాటులో ఉండనున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. న్యాయవాదుల బృందంతో సమావేశమై, అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన తర్వాత.. మధ్యాహ్నం 3 గంటలకు అధికారులకు అందుబాటులోకి రానున్నారు. దీంతో, కేసీఆర్ స్వయంగా విచారణకు సహకరించడం ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు ధీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications