కారం చల్లి యువతి కిడ్నాప్, చంపేశారు, హైద్రాబాద్‌లో బాలికపై రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన నవ వధువు మౌనిక కిడ్నాప్ వ్యవహారం విషాదాంతమైంది. ఆదివారం దేశాయిపేట శివారలో మౌనిక మృతదేహం లభ్యమైంది. దీంతో ఆమెను కిడ్నాప్ చేసిన వారే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

శనివారం రాత్రి తన తండ్రితో కలిసి బైక్ పైన వెళ్తున్న మౌనికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తండ్రి కళ్లలో కారం చల్లి మౌనికను ఎత్తుకెళ్లారు. మౌనికకు మోత్కురావుపేటకు చెందిన యువకుడితో మూడు నెలల క్రితమే వివాహం అయింది.

 Kidnapped woman found dead in Karimnagar district

ఇటీవల తల్లిగారి ఇంటికి వచ్చింది. అనంతరం శనివారం తండ్రితో కలిసి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తోంది. ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. నిందితులను కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

హైదరాబాదులోని శాతంరాయ్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలికకు పురుగుల మందు తాగించి పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kidnapped woman found dead in Karimnagar district on Sunday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి