తెలంగాణ రైజింగ్ విజన్-2047 పాలసీ ఏంటి.. అందులో ఏముంది?
విదేశాలతో పోటీ పడేలా, రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా 'తెలంగాణ రైజింగ్ విజన్-2047 పాలసీ' డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ రైజింగ్ 247 పాలసీ పైన ఆయన ప్రత్యేకమైన దృష్టితో ఉన్నారు. ఈ పాలసీ ద్వారా తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నారు. అసలు ఈ తెలంగాణా రైజింగ్ 2047 పాలసీ ఏంటి? అనేది కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గసూచిక తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ
తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఒక దీర్ఘకాలిక మార్గ సూచిక అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 పాలసీని తీసుకొస్తున్నారు.

తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ లక్ష్యం ఇదే
2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడం, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లడం ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీని రూపొందిస్తున్నారు. అంతేకాదు దేశ స్థూల జాతీయోత్పత్తికి తెలంగాణ నుండి 10 శాతం వాటాను అందించడం కూడా ఇందులో లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో తెచ్చిన పాలసీ
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ప్రాంతాల వారీగా విభజించి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేసేలా ప్లాన్ చేశారు కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ.. ఇలా మూడు రీజియన్లుగా విభజించుకోవాలని సూచించారు.మానవ వనరుల అభివృద్ధి పైన, మౌలిక సదుపాయాల కల్పన పైన, సామాజిక సంక్షేమం పైన, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన పాలసీగా దీనిని తీసుకురానున్నారు.
గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించాలని సీఎం రేవంత్ ఆలోచన
ఈ విజన్ డాక్యుమెంట్ ను త్వరలో తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిన్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2025'పై సమీక్షలో అధికారులు పాలసీ డాక్యుమెంట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తెలంగాణ రైజింగ్ విజన్ 2047
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచడంతోపాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను సదస్సు జరిగే రెండు రోజుల్లో ప్రదర్శించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047' డాక్యుమెంట్.. రాష్ట్ర భవిష్యత్తుకు సమగ్ర మార్గరూపం అని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర యువతలో నైపుణ్యాలను తీర్చిదిద్దాలన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications