కొండా సురేఖకు మరో షాక్.. వరంగల్ లో అనూహ్య పరిణామం!
మంత్రి కొండా సురేఖ ఊహించని కష్టాలలో పడుతున్నారా? మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి అనేక కాంట్రవర్సీ లతో ఇబ్బంది పడుతున్న కొండా సురేఖ తాజాగా సొంత నియోజకవర్గంలో కూడా ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. అనుచరగణం బలంగా ఉందని చెప్పుకునే కొండా సురేఖ ప్రధాన అనుచరులను కోల్పోతున్నారు.
కొండా కపుల్ వ్యవహార శైలిపై చర్చ
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు, చిలికి చిలికి గాలి వానగా మారి కొండా కపుల్ దంపతుల వ్యవహార శైలి పైన రాజకీయంగా చర్చకు కారణమవుతుంది. గత ఎన్నికలలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తర్వాత కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి అయిన తర్వాత కేటీఆర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు, సమంత వ్యవహారంలో నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలతో వరుస వివాదాలలో చిక్కుకున్నారు.

ఎవరితోనూ సఖ్యత లేని కొండా సురేఖ
జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి వంటి నాయకులతో నే కాకుండా, స్థానికంగా ఉన్న బస్వరాజు సారయ్య, గుండు సుధారాణి వంటి వారితో కూడా కయ్యానికి కాలు దువ్వారు. ఏకంగా ఆమె కుమార్తె సీఎం రేవంత్ రెడ్డి పైనే అనుచిత వ్యాఖ్యలు చేసింది. మొత్తం జిల్లా కాంగ్రెస్ అంతా ఒకవైపు ఉంటే కొండా సురేఖ వర్గం ఒకవైపు గా కొంతకాలంగా ప్రచ్చన్నయుద్ధం కొనసాగుతుంది.
కొండా అనుచరులపై పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు
కాంగ్రెస్ అధిష్టానానికి వరుస ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు వారి వ్యవహారంలో కఠిన నిర్ణయం తీసుకోకపోవడంతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులలో కొంత అసంతృప్తి ఉంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటి మీద ముందుకు తీసుకు వెళ్ళవలసిన మంత్రి ఆ బాధ్యతను నిర్వర్తించకుండా ఉండడమే కాకుండా, అనుచరులను పార్టీలో ఉన్న నాయకులను రెచ్చగొట్టి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుండటంతో ఆమె అనుచరుల పైన పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువగా మారుతున్నాయి.
కొండా ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ పై కేసు
కాంగ్రెస్ పార్టీ 25వ డివిజన్ అధ్యక్షుడిని కత్తితో బెదిరించినట్టు, దాడికి పాల్పడినట్టు కొండా సురేఖ ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఇక ఇదే సమయంలో ఎంతోకాలంగా కొండా దంపతులకు ప్రధాన అనుచరుడిగా ఉన్న నల్లగొండ రమేష్ వరంగల్ తూర్పులో నవీన్ రాజ్ తీరుతో, కొండా దంపతుల వైఖరితో కొండా ఫ్యామిలీని వీడి బస్వరాజు సారయ్య గూటికి చేరారు.
సారయ్య గూటికి చేరుతున్న కొండా అనుచరులు
బస్వరాజు సారయ్య ఎటువంటి వివాదాలలోనూ జోక్యం చేసుకోని వ్యక్తి కావడంతో కొండా వర్గంలో వారి వైఖరి నచ్చని వారు ఆయన వైపుకు చేరుతున్నారు. ఇప్పటికే తాజాగా డిసిసి అధ్యక్షుడిగా నియామకమైన ఆయుబ్ సారయ్య డైరెక్షన్స్ తో నడుస్తూ ఉండగా, మరికొంతమంది సారయ్య నాయకత్వంపైన నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ పరిణామాలు వరంగల్ తూర్పులో కొండా సురేఖ పట్టు తగ్గిస్తున్నాయి అని చెప్పడం నిర్వివాదాంశం.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications