ఆ జిల్లాలో ఏకంగా లారీలే చోరీ.. సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీసులు షాక్!!
దొంగతనం అంటే... ఎక్కడైనా ఇళ్లల్లో దొంగతనాలు చేయడం చూసి ఉంటాం. ఇక షాపుల్లో చోరీలు, రోడ్లమీద వెళుతున్నప్పుడు చైన్ స్నాచింగ్ వంటి దొంగతనాలను కూడా చూశాం. అంతేకాదు బైకులు, కార్లను దొంగతనాలు చేసే వారిని కూడా చూశాం. ఇక ఏకంగా లారీలను దొంగతనం చేస్తున్న వారిని చాలా అరుదుగా చూస్తాం. ఇక అటువంటి ఘటనే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో చోటుచేసుకుంది.

కొమురం భీమ్ జిల్లాలో మూడు లారీలు చోరీ
కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఇటీవల కాలంలో లారీలు చోరీలకు గురవుతున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడైనా పొరపాటున లారీ పార్కింగ్ చేస్తే వాటిని దర్జాగా ఎత్తుకు వెళ్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటివరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన లారీలు మూడు చోరీకి గురయ్యాయి. బస్టాండ్ సమీపంలో లారీ ని పార్క్ చేసి బయటకు వెళ్ళి భోజనం చేయడం గాని, మరే ఇతర పనులు కానీ చూసుకొని వద్దామనుకున్న లారీ డ్రైవర్లు తీరా అక్కడికి వచ్చాక లారీ లేకపోవడం చూసి షాక్ తింటున్నారు. వరుసగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన లారీ డ్రైవర్.. సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్
బస్టాండ్ సమీపంలో లారీలు పెడితే వాటి గురించి మర్చి పోవాల్సిందే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇక తాజాగా ఓ లారీ డ్రైవర్ ఒక పని మీద లారీని పార్క్ చేసి బయటకు వెళ్లి వచ్చేసరికి లారీ కాస్త మాయమైంది. దీంతో కంగుతిన్న లారీ డ్రైవర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన లారీ దొంగతనానికి గురైందని లారీ డ్రైవర్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ లారీల చోరీ పై దృష్టి సారించారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు చూసి షాక్ తిన్నారు.

లారీ దొంగలను పట్టుకుంటామని చెప్తున్నపోలీసులు
అక్కడ చోరీ చేసిన లారీని సిర్పూర్ టీ బార్డర్ దాటిస్తున్న క్రమంలో సిసిటివి కెమెరా లో ఆ విజువల్స్ రికార్డయ్యాయి. దీంతో పోలీసులు ఈ కేసు పై దృష్టి సారించామని, త్వరలోనే లారీల దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు. ఏదేమైనా చిన్న వస్తువులు దొంగతనం చేయడానికి దొంగలు నానా చావు చస్తారు. ఇక అటువంటి పరిస్థితిలో ఏకంగా లారీని ఎత్తుకు పోయారు అంటే వీళ్ళు మామూలు దొంగలు కాదని అందరూ చర్చించుకుంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications