మెడిసిన్ ఫ్రమ్ స్కై-డ్రోన్లతో మందులు,వ్యాక్సిన్ సప్లై-రేపు కేంద్రమంత్రి,కేటీఆర్ చేతుల మీదుగా లాంచ్...
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా మందులు,వ్యాక్సిన్ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం 'మెడిసిన్ ఫ్రమ్ స్కై' ప్రాజెక్టును చేపడుతోంది. వికారాబాద్‌లో శనివారం(సెప్టెంబర్ 10) దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ కానుంది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించనున్నారు. వచ్చే నెల మూడో వారం వరకు పైలట్ ప్రాజెక్ట్ కొనసాగనుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్), నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ (అపోలో హాస్పిటల్స్) భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది.
మొదటి దశలో 'కనిపించేంత దూరం'లోని (విజువల్ లైన్ ఆఫ్ సైట్ -వీఎల్‌వోఎస్) ప్రదేశాలకు డ్రోన్ల ద్వారా మందులు,వ్యాక్సిన్లు సప్లై చేస్తారు. ఆ తర్వాతి దశలో ఎంపిక చేసిన మార్గాల్లో 9-10 కిలోమీటర్లలోని ప్రదేశాలకు (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్-బీవీఎల్‌వోఎస్) మెడిసిన్ సప్లై చేస్తారు. తద్వారా దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీతో మెడిసిన్ సప్లై చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లోకి ఎక్కనుంది.

శనివారం నాడు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ సప్లై చేపడుతారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ఎంపిక చేసిన బ్లూడార్ట్ మెడ్ ఎక్స్‌ప్రెస్ కన్సార్టియం (స్కై ఎయిర్), హెలికాప్టర్ కన్సార్టియం (మారుత్ డ్రోన్స్), క్యురిస్ ఫ్లై కన్సార్టియం (టెక్ ఈగల్ ఇన్నోవేషన్స్) సంస్థలు ఇప్పటికే వికారాబాద్‌కు చేరుకున్నాయి.ప్రస్తుతం అక్కడ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాయి.
Recommended Video
మెడిసిన్ ఫ్రం ది స్కై ప్రాజెక్టు ద్వారా... జిల్లా కేంద్రాల్లోని ఔషధ నిల్వల కేంద్రం నుంచి మారుమూల ప్రాంతంలోని గ్రామాలకు గంటల వ్యవధిలో మందులు,వ్యాక్సిన్లను తరలించవచ్చు. స్టాక్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు కేవలం గంటలో వ్యాక్సిన్లు, మందులు తదితర అత్యవసరాలను డ్రోన్ల సహాయంతో సరఫరా చేయవచ్చునని చెబుతున్నారు. ఇందులో ఉపయోగించే డ్రోన్లు భూమికి 500 నుంచి 700 మీటర్ల ఎత్తులో ప్రయాణించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఐటీఈసీ శాఖకు చెందిన 'ఎమర్జింగ్ టెక్నాలజీస్' విభాగం ఈ ప్రాజెక్టును చేపడుతున్నది. ఇందులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం, నీతి ఆయోగ్, హెల్త్ నెట్ గ్లోబల్ (అపోలో హాస్పిటల్స్) భాగస్వాములుగా ఉన్నాయి. మొత్తం ఎనిమిది సంస్థలకు చెందిన కన్సార్షియం దీన్ని నిర్వహిస్తోంది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications