హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్-కోమటిరెడ్డి ఒకే వేదిక మీద : కార్యకర్తలే నమ్మలేని విధంగా ఇద్దరూ- వీహెచ్ రాయబారంతో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణ కాంగ్రెస్ లో ఒక ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరి దీక్ష వేదికైంది. టీపీసీసీ చీఫ్ కోసం చివరి వరకు పోటీ పడి..రేవంత్ కు ఇవ్వటంతో అప్పటి నుంచి కొత్త పీసీసీ చీఫ్ పైన మండిపడుతున్న ఎంపీ కోమటిరెడ్డి ఎట్టకేలకు రేవంత్ కలిసి వేదిక పంచుకున్నారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం..నవ్వుకోవటంతో ఆ దీక్ష వద్ద కొత్త సందడి..చర్చ కనిపించింది. తెలంగాణలో కొంత కాలంగా ధాన్యం కొనుగోలు పైన రాజకీయ వివాదం నెలకొని ఉంది. ఈ వ్యవహారంలో కేంద్రం తీరును తప్పు బడుతూ నేరుగా సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో కలిసి దీక్ష చేసారు.

కాంగ్రెస్ వరి దీక్ష

కేంద్రం ఇప్పటికీ స్పందించటం లేదంటూ ఢిల్లీ వెళ్లారు. కానీ, అక్కడ పార్టీ నేతలు మాత్రమే కేంద్ర మంత్రులను కలిసారు. దీని పైన బీజేపీ నేతలు అసలు ప్రధానితో సహా ఎవరి అప్పాయింట్ మెంట్ కేసీఆర్ కోరలేదని.. వ్యక్తిగత పనుల కోసమే ఢిల్లీ వెళ్లి వచ్చారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ..టీఆర్ఎస్ కు పోటీగా..కాంగ్రెస్ సైతం రెండు రోజుల వరి దీక్ష నిర్వహిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సహా ముఖ్యనేతలు ధర్నాలో పాల్గొన్నారు.

కోమటిరెడ్డి ఆకస్మిక రాక

కోమటిరెడ్డి ఆకస్మిక రాక


రేవంత్‌ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సహా ముఖ్యనేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఇవాళ రాత్రి దీక్షాస్థలంలోనే నేతలు బసచేసి రేపు కూడా నిరసన కొనసాగిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులతో ఆడుకుంటున్నాయని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో వానాకాలంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసేవరకూ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేస్తున్నారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల్లోని ప్రతిగింజను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేవరకు పోరాటం ఆగదని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు.

రేవంత్ తో చేతులు- మాటలు కలుపుతూ

రేవంత్ తో చేతులు- మాటలు కలుపుతూ

ఇక, రేవంత్ పీసీసీ చీఫ్ అయిన సమయం నుంచి అసమ్మతిగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి సడన్ గా వరి దీక్ష వేదిక మీద ప్రత్యక్షమయ్యారు. రేవంత్‌ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన నాటి నుంచి విముఖతతో ఉన్న సీనియర్‌ నేతల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒకరు. అయితే ఆనాటి నుంచి మొన్నటి హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల వరకు రేవంత్‌రెడ్డిపై కోమటిరెడ్డి వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తల్లోకి ప్రతికూల సాంకేతాలు వెళుతున్నాయని గ్రహించిన పార్టీ సీనియర్‌ నేతలు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి ల మధ్య సయోధ్య కుదిర్చే పనిని భుజానికెత్తుకున్నారు.

వీహెచ్ బాధ్యత తీసుకొని..రాయబారంతో

వీహెచ్ బాధ్యత తీసుకొని..రాయబారంతో

కోమటిరెడ్డితో మాట్లాడే బాధ్యత సీనియర్ నేత వీహెచ్‌కు అప్పగించారు.ఆయన పలుమార్లు కోమటిరెడ్డితో చర్చలు చేసారు. దీంతో..ఆయన సూచన మేరకు దీక్షకు వచ్చిన కోమటిరెడ్డిని వేదిక పైన వీహెచ్ రిసీవ్ చేసుకొని..రైతు కండువా కప్పారు. ఆ వెంటనే రేవంత్ సైతం మాటలు కలిపారు. మధ్యలో వీహెచ్ జోక్యం చేసుకొని ఇద్దరికీ చెవుల్లో ఏదో చెప్పారు. కోమటిరెడ్డి సైతం తొలుత కొంత ఇబ్బందిగానే కనిపించినా..తరువాత రేవంత్ తో ఫ్రీగానే మాట్లాడారు. కొద్దిసేపు వేదిక పైన ఉన్న కోమటిరెడ్డి వెళ్లిపోయారు. ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీదకు రావటం.. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవటం..నవ్వుకోవటం చూసి ఇక త్వరలోనే తమ పార్టీ నేతలిద్దరి మధ్య గ్యాప్ భర్తీ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కోమటిరెడ్డి ఈ దీక్షకు నల్లచొక్క ధరించి హాజరయ్యారు. దీని మీద రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

English summary
MP Komatireddy finally shared the stage with Rewanth. As the two were talking and laughing together, a new voice appeared at the initiation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X