రూ.4,100కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్.. ఉగాదికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణా సర్కార్ మూసీ ప్రక్షాళన విషయంలో రాజీ పడేది లేదని అనేకమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రప్రభుత్వం మూసీనది పునరుజ్జీవన పనులను ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. 2026 ఉగాది పర్వదినం నాటికి ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సంవత్సరాది రోజున ఈ పనులకు శంకుస్థాపన చేసి వీలైనంత త్వరగా మొదటి దశ మూసి ప్రక్షాళనను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి రేవంత్ శ్రద్ధ
ఈ క్రమంలోనే భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేసింది. అత్యంత కీలకమైన నిధుల లభ్యత కూడా ఒక కొలిక్కి వచ్చింది. మూసీ నది పునరుజ్జీవన పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఎడిబి రుణం ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసింది. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి, పునరుజ్జీవం నింపడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు.

ఇతర దేశాలలో అధ్యయనం
ఇప్పటికే రాష్ట్ర అధికారులను కొరియా, జపాన్ వంటి దేశాలకు పంపి అక్కడ చేపట్టిన ఇలాంటి ప్రాజెక్టులపైన అధ్యయనం చేయించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ప్రణాళికలో కూడా మూసి పునరుజ్జీవనాన్ని చేర్చారు. నది పొడవున వాణిజ్య సముదాయాలు, వాకింగ్ ట్రాక్ లు అభివృద్ధి చేయాలని, మూసీలో నిత్యం పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చూడాలని వ్యూహరచన చేస్తున్నారు.
మొదటి దశ పనుల్లో ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మాగాంధీ విగ్రహం
అయితే ముందు మొదటి దశలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఈ నెలాఖరుకల్లా సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన పనులకు సంబంధించి, అధికారిక అంచనాలను కూడా రూపొందించనున్నారు. ఇక మొదటి దశలోనే లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఆయన బోధనలను తెలిపే మ్యూజియం వంటివి ఏర్పాటు చేయనున్నారు.
కేంద్రంతో రేవంత్ రెడ్డి సంప్రదింపులు
వివిధ మతాల ప్రార్ధనా మందిరాలతో పాటు మొదటి దశలో మూసి వెంబడి రక్షణ సౌకర్యాల కోసం రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు 250 ఎకరాల భూమిని సేకరించవలసి ఉంది. ఈ విషయం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికోసం కొన్ని ప్రైవేట్ భవనాలను కూడా స్వాధీనం చేసుకోవాల్సి ఉన్న క్రమంలో, బాధితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇక ఈ వివరాలన్నీ డీపీఆర్ లో పొందుపరచనున్నారు.
4,100కోట్ల రూపాయలతో మొదటి దశ పనులు
ఈ మొదటి దశ పనులకు దాదాపు నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రుణాన్ని ఎడిబి బ్యాంక్ నుండి తీసుకునేందుకు బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదన అందిన వెంటనే బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి చివరినాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పనులకు టెండర్లు పిలిచే అవకాశం ఉందని అంచనా. రెండేళ్ల వ్యవధిలో ఈ మొదటి దశ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications