ప్రియుడి భార్యకు నిప్పంటించి చంపిన మహిళ.. 6నెలల బాబుకు తీవ్రగాయాలు..
వివాహేతర సంబంధాలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భార్యల్ని భర్తలు చంపడం, భర్తల్ని భార్యలు చంపడం ఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ మహిళ తన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ప్రమాదంలో కాలిన గాయాలతో ఆ మహిళ మృతి చెందింది. అయితే పెట్రోల్ దాడిలో 6 నెలల బాబుకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ షాకింగ్ ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లి గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. ఓ మహిళ ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ప్రమాదంలో మహిళ చనిపోగా.. ఆమె 6 నెలల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేశ్, మమత దంపతులు. వారికి 5 నెలల బాలుడు ఉన్నాడు. అయితే నగేశ్ కు అదే గ్రామానికి చెందిన సుజాతతో వివాహేతర సంబంధం ఉంది.

అయితే ఇదే విషయంపై తాజాగా సుజాత, మమత మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో గొడవ పెరిగి మమతపై సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించింది. అదే సమయంలో బాధితురాలు మమత తన 5 నెలల కుమారుడిని ఎత్తుకొని ఉంది. మంటల్లో మమత అక్కడికక్కడే మృతి చెందింది. ఇక 5 నెలల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే బాబును నల్గొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త కుందేళ్ల నగేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితురాలు సుజాత పరారీలో ఉందని.. ఆమె కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications