భర్త టైం కేటాయించడం లేదని నవ వధువు ఏం చేసిందంటే..?
క్షణికావేశంలో కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు వారి కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. కాగా భార్య-భర్తల మధ్య మనస్పర్ధలు, గొడవలు అనేవి సహజమే. వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ఆలోచనలతో, వేర్వేరు అలవాట్లు కలిగి పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో పరస్పర అంగీకారం, అభిప్రాయాలను పంచుకుంటే జీవితాంతం ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కానీ ఈ క్రమంలోనే కొన్ని జంటలు పలు కారణాలతో దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు.
అయితే కొత్తగా వివాహ బంధం లోకి అడుగు పెట్టింది ఓ జంట. పెళ్లి జరిగి నాలుగు నెలలు గడవక ముందే భర్త తనకు సమయం కేటాయించడం లేదని మనస్తాపం చెందిన ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లోని మూసాపేట పరిధిలో చోటు చేసుకుంది. ఈ తరహా కారణాలతో నవ వధువు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నాలుగు నెలల క్రితం వివాహం..
ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చందనా జ్యోతి(25).. కొత్తగూడెం నకు చెందిన బి.వెంకటసాయి యశ్వంత్‌తో ఈ ఏడాది ఆగస్టు 14న వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ మూసాపేట లోని ఆంజనేయ నగర్లో నివాసం ఉంటున్నారు. జ్యోతి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేస్తుండగా.. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం చేస్తుంది. యశ్వంత్ స్థానిక మెడ్‌ప్లస్ సంస్థలో పనిచేస్తున్నారు.
అయితే భర్త ఉదయం వెళ్లి రాత్రికి గాని తిరిగి రాకపోవడం.. ఇంట్లోనే ఉంటుండటంతో ఆమె మానసిక వేదనకు లోనైనట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై భర్తతో గత రెండు మూడు రోజులుగా ఆమె గొడవపడుతున్నారని సమాచారం. శుక్రవారం నాడు కూడా గొడవ జరిగి దంపతులు వేరు వేరు గదుల్లో నిద్రపోయారు. శనివారం తెల్లవారుజామున యశ్వంత్ ఎంత పిలిచినా జ్యోతి స్పందించకపోవడంతో.. గది తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే బెడ్‌షీట్‌తో ఉరేసుకుని కనిపించింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ











Click it and Unblock the Notifications