వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల.!నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థ‌ల కోటాలో పన్నెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుదలైంది. ఈ నెల బుదవారం నుంచి నుంచి 23 వ తారీఖు వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 24న ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 26 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఈ స్థానాలకు డిసెంబ‌ర్ 10న పోలింగ్, డిసెంబ‌ర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్టేట్ ఎలక్షన్ కమీషన్ స్పష్టం చేస్తోంది.

 తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ నగారా..

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ నగారా..

రాష్ట్రంలో పెద్ద మొత్తంలోనే ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకటి, వరంగల్‌ ఒకటి, నల్లగొండ ఒకటి, మెదక్‌ ఒకటి, నిజామాబాద్‌ ఒకటి, ఖమ్మం ఒకటి, కరీంనగర్‌ రెండు, మహబూబ్‌నగర్‌ రెండు, రంగారెడ్డి జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా ఈ స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది. అప్పటి నుండి కొత్తగా ఎన్నికైన అభ్యర్ధుల పదవీకాలం పరిగణలోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

12 స్థానిక సంస్థలు, 6 ఎమ్మెల్యే కోటా..

12 స్థానిక సంస్థలు, 6 ఎమ్మెల్యే కోటా..

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాల్టినుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. టీఆర్‌ఎస్‌ ఇవాళ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించింది. టీఆర్‌ఎస్‌కే ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉండటంతో 6 ఎమ్మెల్సీలు ఏకపక్షం కానున్నాయి. ఇక నామినేషన్ల దాఖలుకు నేటి మంగళవారం సాయంత్రం వరకు సమయం ఉంది. కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌషిక్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ఖరారు చేసారు.

తెలంగాణ ఎమ్మెల్యే కోటా అభ్యర్ధులు ఖరారు..

తెలంగాణ ఎమ్మెల్యే కోటా అభ్యర్ధులు ఖరారు..

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్యే కోటా ఎంఎంఎల్సీ స్థానాల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా ఈ నెల 16 వరకూ అంతే నేటి సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ, నవంబరు 17 నుంచి నామినేషన్లను పరిశీలన, నవంబరు 22న ఉపసంహరణ, నవంబరు 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు మే 31తో ఖాళీకాగా, మే 31న మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు (బీజేపీ ), గోవిందరెడ్డి (వైసీపీ)ల పదవీకాలం ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.

మరోవైపు, శాసనమండలిలో మొత్తం 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల నుంచి 11, ఎమ్మెల్యేల కోట నుంచి మరో 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. గత 6 నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

ఏపీలో వైసిపికి పెరగనున్న బలం..

ఏపీలో వైసిపికి పెరగనున్న బలం..

స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఖాళీల భర్తీకి సంబంధించి నిన్నటి వరకు హైకోర్టు తీర్పు అడ్డంకిగా ఉండేది. అయితే, కోర్టు అనుమతితో కౌంటింగ్ పూర్తయి అన్ని జిల్లాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల భర్తీ పూర్తి అయింది. మొత్తంగా చూసుకుంటే.. రాష్ట్ర శాసనమండలిలో 58 స్థానాలు ఉండగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 18 స్థానాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 14 స్థానాలు భర్తీ చేస్తే అన్నీ వైసీపీ ఖాతాలో పడనున్నాయి. దీంతో వైసీపీ బలం పెరిగి శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సైతం కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

English summary
Notification has been issued for twelve MLC positions in the quota of local bodies in Telangana. Nominations will be accepted from Wednesday the 23rd of this month. Nominations of MLC candidates will be considered on the 24th. November 26 is the last date for withdrawal of nominations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X