• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మికసంస్థలు టార్గెట్ గా పీఎఫ్ఐ దాడులకు స్కెచ్.. తెలంగాణా ఇంటిలిజెన్స్ అలెర్ట్!!

|
Google Oneindia TeluguNews

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను భారతదేశంలో ఐదేళ్లపాటు బ్యాన్ చేయడంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు దాడులకు పాల్పడే అవకాశం ఉందా? దేశంలోని అనేక రాష్ట్రాలలో దాడులకు ప్లాన్ చేస్తున్నారా? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు అనుబంధంగా ఉన్న సంస్థలు ముఖ్యంగా హిందూ ధార్మిక సంస్థలను టార్గెట్ చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడతాయా? అంటే దాడులకు పాల్పడే అవకాశం ఉంది అన్న సమాధానం వస్తుంది.

దసరా ఉత్సవాల్లో దాడులకు పీఎఫ్ఐ భారీకుట్ర.. ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు టార్గెట్; వెలుగులోకి మరో సంచలనం!!దసరా ఉత్సవాల్లో దాడులకు పీఎఫ్ఐ భారీకుట్ర.. ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు టార్గెట్; వెలుగులోకి మరో సంచలనం!!

 పీఎఫ్ఐ దాడులకు ఛాన్స్ .. అలెర్ట్ అయిన తెలంగాణా ఇంటిలిజెన్స్

పీఎఫ్ఐ దాడులకు ఛాన్స్ .. అలెర్ట్ అయిన తెలంగాణా ఇంటిలిజెన్స్


ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు దాడులు కొనసాగించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులలో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చెయ్యటం కోసం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని, దీంతో తెలంగాణా ఇంటిలిజెన్స్ అప్రమత్తమైంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కార్యకలాపాలపై అలర్ట్ గా ఉండాలని, పి ఎఫ్ ఐ దాని అనుబంధ సంస్థల పై నిఘా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది.

ఆర్ఎస్ఎస్ , హిందూ ధార్మిక సంస్థలను అప్రమత్తం చేసిన పోలీసులు

ఆర్ఎస్ఎస్ , హిందూ ధార్మిక సంస్థలను అప్రమత్తం చేసిన పోలీసులు


తెలంగాణ రాష్ట్రంలో దాడులు జరిగే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. పిఎఫ్ఐ దాని అనుబంధ సంస్థల పై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను అప్రమత్తం చేశారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.

 టెర్రర్ కార్యాకలపాలకు కేరాఫ్ గా పీఎఫ్ఐ

టెర్రర్ కార్యాకలపాలకు కేరాఫ్ గా పీఎఫ్ఐ


పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశంలో టెర్రర్ కార్యాకలాపాలను చాప క్రింద నీరులా కొనసాగిస్తున్న క్రమంలో ఎన్ఐఏ అధికారులు, టెర్రర్ ఫండింగ్ అనుమానంతో ఈడీ అధికారులు దాడులు చేసి దాదాపు 100 మందికి పైగా పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీపై పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) దాడికి పాల్పడడానికి, ఉత్తరప్రదేశ్లో టెర్రర్‌ మాడ్యూళ్లను తయారుచేయడానికి, మారణాయుధాలు, పేలుడు పదార్థాలతో దాడులు చేయడానికి రెడీ అయిందని విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 పీఎఫ్ఐ ని ఐదేళ్ళ పాటు బ్యాన్ చేసిన కేంద్రం

పీఎఫ్ఐ ని ఐదేళ్ళ పాటు బ్యాన్ చేసిన కేంద్రం


ఏకకాలంలో ఉత్తరప్రదేశ్‌లోని సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై దాడులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సిద్ధమయ్యిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. అంతేకాదు దసరా సందర్భంగా బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని వారి కదలికలను పర్యవేక్షించాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వర్గాలు తెలిపాయి. వీరి హిట్ లిస్టులో దర్యాప్తు సంస్థల అధికారులు కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.దీంతో టెర్రర్ కార్యాకలాపాలకు ఈ సంస్థ పని చేస్తుందని గుర్తించిన కేంద్రం దీనిపై ఐదేళ్ళ పాటు నిషేధం విధించింది.

 ఉగ్రదాడులకు కుట్రల నేపధ్యంలోనే పీఎఫ్ఐ పై దాడులు

ఉగ్రదాడులకు కుట్రల నేపధ్యంలోనే పీఎఫ్ఐ పై దాడులు

మత సామరస్యానికి భంగం కలిగించడం, అల్లర్లను రెచ్చగొట్టడం, భయాందోళనలు సృష్టించడం, ఉగ్ర గ్యాంగ్‌గా ఏర్పడి, యూపీలోని ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో యూపీలోని ముఖ్యమైన, సున్నితమైన ప్రదేశాలు, వ్యక్తులపై ఏకకాలంలో దాడులకు కుట్ర చేసిందని పేర్కొంది. దేశ ఐక్యత, సమగ్రత మరియు సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే సంభావ్య కార్యకలాపాలను కూడా ఆ సంస్థ ఆరోపించింది. విచారణ సమయంలో, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు దాని సభ్యుల వివిధ బ్యాంకు ఖాతాలను విశ్లేషించారు. ఇదే సమయంలో నిందితుల వాంగ్మూలాలను నమోదు చేశారు.

English summary
PFI sketched out attacks targeting RSS and Hindu charities. Telangana Intelligence has alerted the police department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X