వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దుతో ఎటిఎం దొంగలు దొరికారు

పెద్ద నగదు నోట్ల రద్దు వ్యవహారం ఎటిఎం దొంగలను పట్టించింది. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలోని మూడు ఎటిఎంలలో డబ్బులు పెట్టకుండా తమ స్వంతానికి వాడుకొంటున్న 8 మంది ముఠాను గుర్తించారు. ఇందులో ఇద్దరిని అ

By Narsimha
|
Google Oneindia TeluguNews

బాన్సువాడ: పెద్ద నగదు నోట్ల రద్దు సామాన్యులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాని, ఈ నగదు రద్దు వల్ల ఎటిఎం దొంగలు బయటపడుతున్నారు. చాలా కాలంగా ఎటిఎంలలో డిపాజిట్ చేయాల్సిన సొమ్మును స్వంతానికి వాడుకొంటూ బయటకు రాకుండా ఎంజాయి చేస్తోన్న వారంతా పెద్ద నగదు నోట్ల రద్దుతో దొరికిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎటిఎంలలో డిపాజిట్ చేయాల్సిన నగదును స్వంతానికి వాడుకొన్న ఇద్దరుసెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్టు చేశారు.

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, పిట్లం మండలాల పరిధిలోని మూడు ఎటిఎంలలో 31 లక్షలను ఎనిమిది మంది ముఠా సభ్యులు వాడుకొన్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు తో ఈ విషయం వెలుగు చూసింది. పెద్ద నగదు నోట్ల రద్దు చేయకపోతే ఈ ఘటన వెలుగుచూసేదికాదు.ఎటిఎంల వద్ద పనిచేసే సెక్యూరిటీ గార్డులను విచారిస్తే అసలు విషయం వెలుగు చూసింది.

రెండు రోజులుగా ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. తమతో పాటు మరో ఆరుగురి ఈ ఘటనలో పాలుపంచుకొన్నారని సెక్యూరిటీ గార్డులు పోలీసులకు వివరించారు.

police arrest atm security guards in banswada

రైటర్స్ సేఫ్ గార్డ్స్ ఏజెన్సీ ఎటిఎంలలో డబ్బులు స్వాహా చేసిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తే వాస్తవాలు వెలుగుచూశాయి.బాన్సువాడకు చెందిన లక్ష్మణ్, దుర్గాప్రసాద్ లు ఎటిఎంల వద్ద సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు.

ఎటిఎంలలో డబ్బులు పూర్తిగా పెట్టకుండా కొంత డబ్బునే ఎటిఎంలలో డిపాజిట్ చేసేవారు. అయితే ఎటిఎం ల వద్ద ఆడిట్ నిర్వహణకు వచ్చే విసయాన్ని ముందుగానే తెలుసుకొని ఇతర ఎటిఎంల నుండి డబ్బును తీసుకొని ఆడిట్ చేసే ఎటిఎం లో జమ చేసేవారు పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో అసలు విషయాన్ని గుర్తించారు నిర్వాహాకులు. ఈ ఎటిఎంలలో సుమారు 31 లక్షలు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ నగదు మాయమైన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎటిఎంల నుండి డబ్బులు డిపాజిట్ చేయకుండా తమ స్వంతానికి వాడుకొన్న విషయం బట్టయలైంది. ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు ఆరుగురు ముఠాగా ఏర్పడి ఈ నగదును స్వాహా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

పెద్ద నగదు నోట్ల రద్దు సామాన్యులకు ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాని, ఈ నగదు రద్దు వల్ల ఎటిఎం దొంగలు బయటపడుతున్నారు. చాలా కాలంగా ఎటిఎంలలో డిపాజిట్ చేయాల్సిన సొమ్మును స్వంతానికి వాడుకొంటూ బయటకు రాకుండా ఎంజాయి చేస్తోన్న వారంతా పెద్ద నగదు నోట్ల రద్దుతో దొరికిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎటిఎంలలో డిపాజిట్ చేయాల్సిన నగదును స్వంతానికి వాడుకొన్న ఇద్దరుసెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
laxman, durga prasad working as security guards in atm centers at banswada,along with 2 security guards another six members form a team. they didnot deposit full amount in atms,some amount taken use for them.recently central governament ban 550m1000 rupees notes, currency ban effect on this gorup. in htree atms around 31 lakhs miss, police complient against cash miss incident agency. police arrest two security guards , they tell how to theft atms money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X