వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంజీఎంలో ఎలుకల ఎఫెక్ట్.. సూపరింటెండెంట్‌, వైద్యులపై వేటు, చర్యలకు ఆదేశం

|
Google Oneindia TeluguNews

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న రోగి చేతి వేళ్ళు, కాలి వేళ్ళు ఎలుకలు కొరికి ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఆసుపత్రి అయిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బెడద ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో తెలంగాణా సర్కార్ సీరియస్

రోగిని ఎలుకలు కొరికిన ఘటనలో తెలంగాణా సర్కార్ సీరియస్

భీమారం కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో చేరగా ఐసీయూలో ఉన్న అతనిని ఎలుకలు కొరికి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు కట్టు కట్టారు. ఇలా ఒక్కసారి కాదు నాలుగు రోజుల్లో రెండు సార్లు ఎలుకలు శ్రీనివాస్ పై దాడి చేయడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించింది.

 సూపరిండెంటెంట్ బదిలీ , ఇద్దరు వైద్యులపై వేటు

సూపరిండెంటెంట్ బదిలీ , ఇద్దరు వైద్యులపై వేటు

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై విచారణ జరపాలని కలెక్టర్ ను ఆదేశించింది. అంతేకాదు ఆసుపత్రి సూపరిండెంటెంట్ శ్రీనివాస్ రావును కూడా బాధ్యుడిగా గుర్తించి ఆయన పై బదిలీ వేటు వేసింది. ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెంట్ గా శ్రీనివాస రావు స్థానంలో చంద్రశేఖర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

తక్షణమే విచారణ జరిపి నివేదిక పంపాలని ఆదేశించిన సర్కార్

తక్షణమే విచారణ జరిపి నివేదిక పంపాలని ఆదేశించిన సర్కార్


ఇదిలా ఉంటే రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై పూర్తి వివరాలు తక్షణమే నివేదిక పంపించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎలుకల దాడిలో గాయపడిన రోగికి నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించాలని సూచించింది. ప్రాథమిక రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిందిగా ఆసుపత్రి ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రజల వైద్య సేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది ప్రభుత్వం.

 మంత్రి హరీష్ రావు సీరియస్, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు అని వార్నింగ్

మంత్రి హరీష్ రావు సీరియస్, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు అని వార్నింగ్


ఇక ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు కూడా అధికారుల అలసత్వం పై సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించిన ఆయన ప్రజారోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఎలుకల బెడద ఇంతగా పెరగటానికి ఆస్పత్రిలో శానిటేషన్ నిర్వహణ సరిగా లేదని అధికారులు గుర్తించారు. దీంతో శానిటేషన్ నిర్వహణపై దృష్టి సారించాలని ఆదేశించారు.

English summary
Two doctors suspended who were negligent in their duties in the incident where a patient was bitten by rats in the MGM. The Collector was directed to conduct an inquiry. The hospital superintendent also transferred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X