వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుధారాణికి ఇది తెలియదా, నష్టం లేదు: రావుల, డబ్బుందని వద్దు: సర్వే

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పార్టీని వీడితే ఎలాంటి నష్టం లేదని తెలంగాణ టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీని చేసేది కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇంత చిన్న విషయం సుధారాణికి తెలియకపోవడం విడ్డూరమన్నారు.

30వేల నీటి పథకాలు, 16వేల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను జలహారం (వాటర్ గ్రిడ్)తో ఎలా అనుసంధానం చేస్తారో చెప్పాలని ఆయన టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేది కేంద్రమే అన్నారు. కాగా, వరంగల్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడంపై గురువారం మాట్లాడారు. దీనిపై రావుల ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో దిగ్విజయ్‌సింగ్‌ భేటీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌ హైదరాబాద్‌ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. వరంగల్‌ ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి ఖరారుపై సీనియర్‌నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పులువురు కాంగ్రెస్‌ నేతలు భేటీలో పాల్గొన్నారు. వరంగల్ అభ్యర్థి పైన దిగ్విజయ్ నేతల నుంచి ఆరా తీశారు. ఎవరిని నిలబెడితే గెలుస్తామనే ప్రశ్నించారు.

Ravula satire on Gundu Sudharani

డబ్బులున్నాయని వివేక్‌కు టిక్కెట్ వద్దు: సర్వే

డబ్బులు ఉన్నాయని చెప్పి పెద్దపల్లి మాజీ ఎంపి వివేక్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పారు.

మరోవైపు, తాను పోటీ చేయనని టిక్కెట్ సర్వే సత్యనారాయణకు ఇవ్వాలని వివేక్ పార్టీ సీనియర్ నేత డిగ్గీకి సూచించారు.

వరంగల్ టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో సీఎం కెసిఆర్ భేటీ అయ్యారు. తెలంగాణభవన్‌లో జరుగుతోన్న ఈ సమావేశానికి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. వరంగల్ లోకసభకు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి ఎంపికపై చర్చిస్తున్నారు.

English summary
Telangana TDP leader Ravula Chandrasekhar Reddy satire on MP Gundu Sudharani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X