"నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం KCR కుటుంబానికి అధికారం దక్కనివ్వను"
నారాయణపేట జిల్లా కోస్గి లో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్ ల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామని అన్నారు. ఒకవేళ 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
"చాలా రోజుల తరువాత బయటకు వచ్చి తోలు తీస్తానని కెసీఆర్ మాట్లాడుతున్నారు. మా సర్పంచులు చీరి చింతకు కట్టి చింతమడకకు పంపిస్తారు జాగ్రత్త. సోయి లేని మాటలు.. స్థాయి లేని విమర్శలు. ఒక్కటైనా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడలేదు. పదేండ్లు పాలమూరుపై పగబట్టి.. పాలమూరు అభివృద్ధిని అడ్డుకున్నాడు. మటన్ కొట్టు మస్తాన్ కు చెప్తా... అక్కడకు వెళ్లి తోలు తీయ్. నలభై ఏండ్ల అనుభవంతో మాట్లాడే మాటలు ఇవేనా.. మాకు మాటలు రాక కాదు. మర్యాద ఉండదని మాట్లాడటం లేదు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
"రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటున్నాడు.. ఇదేం దుబాయ్ పాస్ పోర్ట్ బ్రోకర్ దందా కాదు. నేనేం పాస్ పోర్టు బ్రోకర్ దందా చేయలేదు. అయ్య పేరు చెప్పుకుని మంత్రి పదవి తీసుకోలేదు. మేం కక్షా రాజకీయాలు చేయం.. ఎవరి పాపాన వాళ్లే పోతారని మా పని మేం చేసుకుంటున్నాం. అయినా మా జోలికి వస్తే మా కార్యకర్తలు ఊరుకోరు" అని సీఎం రేవంత్ అన్నారు.
"కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా.. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా. 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా..ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా" అని సీఎం రేవంత్.. కేసీఆర్ కు సవాల్ విసిరారు.
"నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కు అధికారం ఇక కల్లనే. బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే.. కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం. పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు. అసెంబ్లీలో చర్చిద్దాం రా. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం. సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం. కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి" అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

"సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు. మీ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదు. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి" అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications