నుమాయిష్ పర్యటనను వాయిదా వేసుకోవాలి: సజ్జనార్
నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని కోరారు.
ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
నాంపల్లిలోని ఓ ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. నగర ప్రజలు నుమాయిష్ పర్యటనను ఈ రోజుకు వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించిన కారణంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని కోరారు. మరోవైపు దట్టమైన పొగలు అలుముకోవడంతో భవనంలోకి రెస్క్యూ టీం వెళ్లలేకపోతోందని సజ్జనార్ పేర్కొన్నారు.
వాహనాల దారి మళ్లింపు
అలాగే అగ్నిప్రమాదం కారణంగా పరిసర ప్రాంతాల్లోని వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డీ ఆర్ ఎఫ్ బృందాలు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారని సజ్జనార్ వివరించారు. ఫర్నీచర్ దుకాణంలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని.. అయితే దట్టమైన పొగలు వ్యాపించి ఉండటంతో రెస్క్యూ టీమ్ భవనంలోకి వెళ్లలేక పోతోందన్నారు.

ఇక నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా నాలుగంతస్థులు ఉన్న ఈ భవనంలోని అన్ని ఫ్లోర్లకు వ్యాప్తి చెందాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా, విపత్తు నిర్వహణ బృందం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అగ్ని మాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్ వాహనాలు, స్కైలిఫ్ట్ క్రేన్ సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications