తెలంగాణాలో పెన్షన్ దారులకు షాక్.. లెక్క తేల్చనున్న రేవంత్!
తెలంగాణ ప్రభుత్వం త్వరలో పెన్షన్ దారులకు షాక్ ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలాకాలంగా సామాజిక భద్రత పెన్షన్లలో అక్రమాలు కొనసాగుతున్న క్రమంలో రేవంత్ ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ ను చేపట్టింది. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అనర్హుల ఏరివేతకు నిర్ణయం తీసుకుంది.
ఫోరెన్సిక్ ఆడిట్లో బోగస్ పెన్షనర్లు
నాలుగు జిల్లాలలో దాదాపు 20 వేల మంది పెన్షనర్ల వివరాలను ఫోరెన్సిక్ ఆడిట్లో భాగంగా పరిశీలించగా వీరిలో 10 శాతం అంటే దాదాపు 2000 మంది అనర్హులుగా లెక్క తేలింది. అనర్హులలో, చనిపోయిన వారి పేరుతో పెన్షన్లు పొందుతున్న వారు, 50 ఏళ్లు నిండకుండానే వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న వారు ఉన్నారు. ఇక వైకల్యం లేకున్నప్పటికీ నకిలీ పత్రాలతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారు కూడా ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్
దీంతో ప్రతి నెల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందని భావించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
పైలెట్ ప్రాజెక్టులోనే బోలెడన్ని బోగస్ పెన్షన్లు బయటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అనర్హులను తొలగించి వారి నుంచి అక్రమంగా పొందిన సొమ్మును రికవరీ చేయాలని నిర్ణయించింది. ఆ నిధులను అర్హులకు కేటాయించి పెన్షన్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అక్రమ మార్గంలో పెన్షన్ పొందేవారికి టెన్షన్
దీంతో అక్రమ మార్గంలో పెన్షన్ పొందుతున్న వారిలో టెన్షన్ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ ప్రభుత్వం 43 లక్షల మందికి చేయూత పెన్షన్లను అందిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు, ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ రోగులకు కలిపి 20 వేలకు పైగా కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. వృద్ధాప్య, వితంతు, నేతన్న, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 2016 రూపాయలు ఇస్తుంది.
పెన్షన్ ల పెంపుకు ముందు వారికి షాక్
దివ్యాంగులకు నెలకు 4016 రూపాయలు, దీర్ఘకాలిక డయాలసిస్ బాధితులకు 5000 రూపాయల నుండి పదివేల రూపాయల వరకు పెన్షన్లను అందిస్తున్నారు. అయితే కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు సాధారణ పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు, దివ్యాంగుల పెన్షన్లను 6 వేల రూపాయలకు పెంచవలసి ఉంది. ఈ పెంపుకు ముందు బోగస్ పెన్షన్లను ఏరివేసి వారి నుంచి ఆ డబ్బును తిరిగి రికవరీ చేసి, ఆ పైన పెన్షన్ల పెంపు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫోరెన్సిక్ ఆడిట్ పైన రాష్ట్రవ్యాప్తంగా అందరిలో ఉత్కంఠ చోటుచేసుకుంది
-
బిగ్ షాక్.. తెలంగాణలో రేపటి నుంచి చికెన్ షాపులు బంద్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications