సర్పంచ్ ఎన్నికల్లో తమ్ముడి ఓటమిని తట్టుకోలేక ఆగిన అక్క గుండె...
ఎన్నికల్లో గెలుపు, ఓటములు అనేవి ప్రజానిర్ణయం. ఎందరో రాజకీయ ఉద్దండులు, మహామహులు సైతం ఘోర ఓటమిని చవిచూసిన సందర్భాలు భారత రాజకీయ చరిత్రలో ఉన్నాయి. కాగా రీసెంట్ గానే తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. కానీ ఎన్నిక మాత్రం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడాన్ని తట్టుకోలేక అక్క గుండెపోటుతో మృతి చెందడం సర్వత్రా కలిచి వేస్తోంది.
ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోతు శేఖర్ సర్పంచ్‌గా పోటీ చేయడంతో.. తమ్ముడు ఎలాగైనా గెలవాలని అక్క కొప్పుల మమత(38) భావించింది. దీంతో ఎన్నికల ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం కోరుట్ల నుంచి గ్రామానికి కూడా చేరుకుంది. అయితే కౌంటింగ్ జరుగుతుండగా తమ్ముడు వెనకంజలో ఉన్నాడని తెలుసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది మమత.

వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే తుదిశ్వాస విడిచింది. మమతకు గతంలో గుండెపోటు రావడంతో స్టంట్ వేసినట్లు కుటుంబ సభ్యులు వాపోయారు. ఎన్నికల్లో 187 ఓట్ల తేడాతో ఓడిపోయిన శేఖర్ ఓడిపోయాడు. మొత్తానికి తమ్ముడు ఎన్నికల్లో ఓడిపోయాడని అక్క గుండెపోటుతో మృతి చెందిన ఘటన గ్రామస్థులతో పాటు సామాన్యులను సైతం తీవ్ర విషాదం కలిగిస్తోంది.
ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 4,236 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 2335, బీఆర్ఎస్ 1168, బీజేపీ 189, ఇతరులు 538 స్థానాల్లో ఆయా పార్టీల మద్దతు ఉన్న అభ్యర్ధులు విజయం సాధించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 79.15 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 87.93 శాతం పోలింగ్ నమోదు అయింది.
తక్కువ ఓట్ల తేడాతో విజయం..
నల్గొండ జిల్లా మద్దిరాల మండలం తూర్పు తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య వీరన్న ప్రత్యర్థిపై ఒక్క ఓటుతో విజయం సాధించాడు.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ అభ్యర్థి స్రవంతి కేవలం 4 ఓట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం ర్యాగట్లపల్లిలో భాగ్యమ్మ అనే సర్పంచ్ అభ్యర్థి కూడా కేవలం 5 ఓట్లతో గెలుపొందింది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండాలో BRS బలపరిచిన జాటోత్ హరిచంద్ 9 ఓట్లతో విజయం సాధించాడు.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications