వాల్ మార్ట్‌తో ఒప్పందం: రాష్ట్రంలో 10స్టోర్లు, 20వేల ఉద్యోగాలు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో భాగంగా వాల్ మార్ట్ సంస్థతో తెలంగాణ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వాల్ మార్ట్ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో కంపెనీ నెలకొల్పబోయే మాల్స్, ఉపాధి అవకాశాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది.

కాగా, రాబోయే పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం జరిగినట్లు సమాచారం. దీని ప్రకారం వచ్చే 10ఏళ్లలో రాష్ట్రంలో 10 వాల్ మార్ట్ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ లో 5 వాల్ మార్ట్ స్టోర్లతో పాటు, ఇతర జిల్లాల్లో మరో 5 స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు.

 Telangana Govt Signs MoU With Walmart

వాల్ మార్ట్ రాకతో ఒక్కో స్టోర్‌లో 2వేల మందికి ఉపాధి అవకాశం లభించనుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పబోయే 10వాల్ మార్ట్ స్టోర్లలో 20వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Govt signed MoU With Walmart. According to this agreement 10walmart stores will be opened over the next 10years

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి