రాహుల్ కాదు, వాళ్ల జేజేమ్మ దిగొచ్చినా.., మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 'రాహుల్ గాంధీ కాదు, వాళ్ల జేజేమ్మ దిగొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు..' అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు బుధవారం టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని వ్యాఖ్యానించారు.

minister-ktr

కాంగ్రెస్ నాయకులకు బాస్ లు ఢిల్లీలో ఉండొచ్చు, కానీ, టీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ ప్రజలే బాస్ లని, వేరే వాళ్లెవరూ బాస్ లు కాదని, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో, వారికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే విషయం రేవంత్ రెడ్డికే కాదు, వాళ్ల నాయకురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా తెలుసని మంత్రి కేటీఆర్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana IT Minister K.Taraka Rama Rao passed sensational comments on Rahul Gandhi here in Hyderabad on Wednesday. Some TDP leaders of Kodangal Constituency today joined in TRS. On this occassion in a meeting while speaking Minister KTR told that Not only Rahul Gandhi their if their fore fathers comes also they can't stop the winning of TRS again in comming elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి