బాసరలో వీఐపీ వాహనాలకు సైతం నో ఎంట్రీ
తెలంగాణలో ఆలయాల జీర్ణోద్ధారణ, అక్కడి పరిపాలన, లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. తిరుమల తరహాలో ఆలయాలను అభివృద్ధి చేయాలని, అక్కడి విధానాలను ఆదర్శంగా తీసుకుని, ఆగమ శాస్త్రాల ప్రకారం కొత్త నిబంధనలను రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు.
నిర్మల్ జిల్లా గోదావరి నది ఒడ్డున వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ప్రభుత్వం 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తోంది. రేపు ఈ ఆలయ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మాస్టర్ ప్లాన్‌పై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి అయ్యే అంచనా వ్యయం గురించి వెల్లడించారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు రేవంత్ రెడ్డి పలు సవరణలను సూచించారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేవాలయాల్లో ఆధ్యాత్మికత, పవిత్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రార్థనా మందిర ప్రాంగణాల్లో రాజకీయ కార్యకలాపాలు, సభలు, ప్రదర్శనలు పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. బసర ఆలయ అభివృద్ధి పనులను సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు కట్టుబడి పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో వాహనాల రద్దీని నియంత్రించడం, ప్రముఖులు, వీఐపీల వాహనాలను సైతం ఆలయ సముదాయం వెలుపలే పార్క్ చేయాలని నిబంధనలు విధించారు.
అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, లోపాలుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సువిశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భక్తుల విశ్వాసాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు.
తిరుమల తిరుపతి తరహాలో అన్ని ఆలయాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా నిబంధనలు ఉండాలని చెప్పారు. ఆలయ పరిసరాల్లో ఎలక్ట్రికల్ వాహనాలను మాత్రమే వినియోగించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.
-
గోల్కొండ తారామతి రిసార్ట్ లో డ్రగ్స్ పార్టీ, బాలీవుడ్ నటులు, ఈగల్ టీమ్ షాకింగ్ రైడ్! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications