హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల: 25 నుంచి అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా, నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.శుక్రవారం 5,204 స్టాఫ్ న‌ర్సుల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 25 నుంచి ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు.

డీఎంఈ, డీహెచ్ ప‌రిధిలో 3,823 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వైద్య విధాన ప‌రిష‌త్‌లో 757 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

 Telangana staff nurse notification released for 5204 posts

పోస్టుల వివరాలు:
డీఎంఈ, డీహెచ్ - 3,823
వైద్య విధాన ప‌రిష‌త్ - 757
ఎంఎన్‌జే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ - 81
డిజ‌బుల్డ్, సినీయ‌ర్ సిటిజెన్స్ వేల్ఫేర్ - 8
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియ‌ల్స్ - 127
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ - 197
ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్స్ - 74
సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ - 124
తెలంగాణ రెసిడెన్షియ‌ల్స్ ఎడ్యుకేష‌న్ ఇన్‌స్టిట్యూష‌న్ - 13

1365 పోస్టులకు గ్రూప్-3 నోటిఫికేషన్

గురువారం గ్రూప్-2 నోటిఫికేష‌న్ విడుద‌ల కాగా, తాజాగా గ్రూప్-3 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 1365 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

అర్హులైన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 24 నుంచి ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ‌లోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మరిన్ని వివ‌రాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు: 1365

అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ డిపార్ట్‌మెంట్: 27
ఎనిమల్ హస్బెండ్రీ, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీష్: 02
బ్యాక్వార్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఎనర్జీ డిపార్ట్‌మెంట్: 02
ఎన్వీరాన్మెంట్, ఫారెస్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్: 07
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్: 712
ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్‌మెంట్: 16
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్: 46
హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 39
హైయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 89
హోం డిపార్ట్‌మెంట్: 70
ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్: 25
ఇరిగేషన్ అండ్ కామండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 01
లేబర్ అండ్ ఎప్లాయ్ మెంట్ డిపార్ట్‌మెంట్: 33
మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 06
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్: 18
పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ : 29
ప్లానింగ్ డిపార్ట్‌మెంట్: 03
రెవెన్యూ డిపార్ట్‌మెంట్: 73
షెడ్యూల్ క్యాస్ట్స్ డెవలప్మెంట్ డిపార్ట్‌మెంట్: 36
సెకండరీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 56
ట్రాన్స్ పోర్ట్, రోడ్, బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్: 12
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్: 27
ఉమెన్, చిల్డ్రెన్, డిసబెల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్‌మెంట్: 03
యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజమ్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్: 05
ట్రైబల్ వెల్ఫేర్(ట్రైకోర్): 01

783 గ్రూప్-2 పోస్టుల‌కు గురువారం నోటిఫికేష‌న్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేష‌న్లు కూడా విడుదల చేసింది. గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫ‌లితాలు కూడా త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్నాయి. హాస్ట‌ల్ వార్డెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. హార్టిక‌ల్చ‌ర్, వెట‌ర్న‌రీ శాఖ‌ల్లో కూడా కొలువుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మ‌రోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క్రియ కొన‌సాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో భాగంగా ఫిజిక‌ల్ ఈవెంట్స్ కొన‌సాగుతున్నాయి.

English summary
Telangana staff nurse notification released for 5204 posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X