పండుగల వేళ TGSRTC భారీ షాక్, ఛార్జీల పెంపు - ఇక ఇలా ..!!
వరుస పండుగల వేళ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ మేరకు రూట్లను ఖరారు చేసింది. ప్రధానం గా ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతో, ఆ రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ నెల 23వ తేదీ తిరుగు ప్రయాణ రద్దీకి సంబంధించి ప్రత్యేక బస్సుల ఏర్పాటు పైన నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది.
ఉగాది, రంజాన్ వరుస సెలవులతో సొంత ఊర్లకు వెళ్లే వారితో రద్దీ ఏర్పడనుంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మార్చి 17 నుంచి మార్చి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పుతోంది. ఈ బస్సుల్లో అదనంగా 50 శాతం ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. డీజిల్ ఖర్చులు, బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చుల కారణంగా అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.

ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ 2023లో జీవో 16ను ప్రభుత్వం జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ఇప్పుడు ఛార్జీలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమలు చేస్తామని టీజీఎస్ఆర్టీసీ అధికారులు స్పష్టం చేసారు. కేవలం పండుగ కారణంగా తిప్పే ప్రత్యేక బస్సుల్లోనే ఎక్స్ట్రా ఛార్జీలు ఉంటాయని, ప్రయాణికులు దీనిని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.
ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం అమలు
కాగా, ఈ ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి పథకం యథాతధంగా వర్తిస్తుందని, మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేసారు. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉండనుంది. కాగా, పండుగల వేళ ఈ స్పెషల్ బస్సులు 17,18వ తేదీలతో పాటు 23వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ను www.tgsrtcbus.in వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. ఉగాది, రంజాన్ పండుగల ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది.
-
Smart Nails : మీ డ్రస్సింగ్కు తగ్గట్టు సెకన్లలో రంగు మార్చేసే "స్మార్ట్ గోళ్లు".. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!













Click it and Unblock the Notifications