రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఇక నుంచి..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రిజర్వేషన్.. వెయిటింగ్ లిస్టు కష్టాల నుంచి ప్రయాణీకుల నుంచి వెసులు బాటు కల్పించేలా కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా చివరి నిమిషం వరకు టికెట్ కన్షర్మేషన్ పైన ప్రయాణీకుల్లో అనిశ్చితికి తెర పడనుంది. రైల్వే శాఖ తాజా నిర్ణయాన్ని అన్ని జోన్లు వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశించింది. అదే విధంగా కొత్త టైమింగ్స్ ను ఖరారు చేసారు.
రైల్వే ప్రయాణీకులకు వెసులుబాటు కలిగేలా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టు సిద్ధం కానుంది. ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించేందుకు ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు రైల్వేశాఖ తొలిసారిగా రిజర్వేషన్ చార్టు రూపొందించే సమయాన్ని సవరించింది. ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి 4గంటల ముందు మాత్రమే రిజర్వేషన్ చార్జును సిద్ధం చేసేవారు.

దీంతో ప్రత్యేకించి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల్లో చివరి క్షణాల వరకు ఉత్కంఠ కొనసాగేది. పది గంటలు ముందుగా చార్టు సిద్ధం చేయడం వల్ల తాత్కాలిక బస, రైల్వేస్టేషన్‌కు చేరుకునే ఏర్పాట్లు, అవసరమైతే ప్రత్యా మ్నాయ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రయాణికులకు అవకాశం కలుగుతుందని రైల్వే శాఖ పేర్కొంది. అన్ని రైల్వే జోన్లు దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. రైల్లో ప్రయాణించే సమయంలో నిర్దేశిత బరువు దాటిన లగేజీకి చార్జీలు చెల్లించాల్సిందేనని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభకు తెలిపారు.
అందులో భాగంగా ప్రస్తుతం క్లాస్ వైజ్‌గా రైళ్లలో లగేజీకి కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్లో నగదు జమచేసిన వ్యక్తులు ఆ డబ్బును రైలు టికెట్లు కొనేందుకు మాత్రమే ఉపయోగించుకోగలరని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఆ డబ్బును వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చిచెప్పారు. అయితే, ఈ-వాలెట్‌ను రద్దు(క్లోజ్) చేసుకున్నప్పుడు అందులోని డబ్బును వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేస్తామని తెలిపారు.
రిజర్వేషన్ చార్టు సిద్ధంచేసే కొత్త సమయాలు వెల్లడించారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ఇకపై తొలి రిజర్వేషన్ చార్టును ముందురోజు రాత్రి 8 గంటలకే తయారు చేయనున్నారు. మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 గంటల మధ్య, అలాగే అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య బయలుదేరాల్సిన రైళ్లకు 10 గంటలు ముందుగా తొలి రిజర్వేషన్ చార్టును రూపొందించేలా నిర్ణయం తీసుకున్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications