సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించే సింబల్స్ ఇవే..!
తెలంగాణలోని పల్లెల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. పంచాయతీ ఎన్నికల సంగ్రామం త్వరలోనే జరగనున్న నేపధ్యంలో మరోసారి రాష్ట్రానికి రాజకీయ రంగు అలుముకుంది. అయితే పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. గెలుపొందిన అభ్యర్ధులు వారి నిర్ణయం ప్రకారం ఆయా పార్టీలకు మద్దతు తెలుపుతారు. అందుకే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ గుర్తులు ఉండవు. ఈ క్రమంలోనే వారికి ప్రత్యేకంగా 'ఫ్రీ సింబల్స్'ను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కేటాయిస్తుంది.
వర్ణక్రమంలో అభ్యర్థుల పేర్లు..
కాగా నామినేషన్ పత్రాల ఆధారంగా రిటర్నింగ్ అధికారి అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల క్రమంలో వరుసగా ఒక జాబితా రూపొందిస్తారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన క్రమనికి ఇందుకు సంబంధం ఉండదు. అభ్యర్థి పేరులోని మొదటి అక్షరంనే పరిగణలోకి తీసుకుంటారు కానీ ఇంటిపేరు ఆధారంగా ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.

అయితే ఒకే పేరుతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పోటీ చేస్తే మాత్రం ముందుగా ఇంటిపేరు మొదటి అక్షరం ఆధారంగా వారి క్రమాన్ని నిర్ణయిస్తారు. అంతకంటే ఎక్కువ పేర్లు ఒకేలా ఉంటే.. అభ్యర్థుల వృత్తి, నివాసం వంటి వివరాలతో ప్రత్యేక జాబితా తయారు చేస్తారు. ఇందులో గౌరవపదవులు, డిగ్రీలు పరిగణనలోకి తీసుకోరు.
ఎన్నికల చిహ్నాల కేటాయింపు విధానం..
అయితే సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలోని మొదటి గుర్తు, రెండవ అభ్యర్థికి రెండో గుర్తు ఇలా వరుసగా చిహ్నాలు కేటాయిస్తారు. వార్డు సభ్యుల జాబితాకు కూడా అదే విధానం అమలు చేస్తారు.
సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించే ఫ్రీ సింబల్స్..
ఉంగరం, కత్తెర, క్రికెట్ బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, బ్లాక్‌బోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ గ్లాస్, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మన్, తెరచాపతో పడవ, బిస్కెట్, వేణువు, చైన్, చెప్పులు, గాలిబుడగ, క్రికెట్ స్టంప్స్.
ఈ చిహ్నాలు పూర్తిగా ఫ్రీ సింబల్స్ కావడంతో రాష్ట్రంలోని ఏ అభ్యర్థికైనా వర్ణక్రమ జాబితా ఆధారంగా కేటాయిస్తారు. అంతే కాకుండా వీటితో పాటు "నోటా" (None of the above)కి కూడా స్థానం ఉంటుంది.
మరోవైపు ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా నేటితో ( నవంబర్ 29, 2025 ) మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మొత్తంగా పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పూర్తికానున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11న జరగనుండగా.. ఉదయం నుంచే ఓటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం తర్వాత లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఫలితాల అనంతరం ఉప సర్పంచి ఎన్నిక కూడా అదే రోజు పూర్తి చేయనున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications