వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గు బ్లాకుల వేలం: ఆపకుంటే భరతం పడతాం.. బీజేపీని టార్గెట్ చేసిన గులాబీఎమ్మెల్యే బాల్క సుమన్!!

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణిని నట్టేట ముంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడైన అదానీకి బొగ్గు బ్లాకులను కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తోందని బాల్క సుమన్ మండిపడ్డారు.

సింగరేణి కార్మికుల సమ్మె సైరన్; నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.. కారణం ఇదే!!సింగరేణి కార్మికుల సమ్మె సైరన్; నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి.. కారణం ఇదే!!

సింగరేణి కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ

సింగరేణి కార్మికులను నట్టేట ముంచే ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ

ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను నట్టేట ముంచిన బీజేపీ, ఇప్పుడు సింగరేణి కార్మికులను కూడా నట్టేట ముంచటం కోసం ప్రయత్నాలు చేస్తోందని బాల్క సుమన్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణిలో కోల్ బ్లాకులను వేలం వేయవద్దని మూడు రోజులపాటు కార్మికుల సమ్మె చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని బాల్క సుమన్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి బీజేపీ నేతలు మాట్లాడడం లేదని వారిని నిలదీయాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు.

 కోల్ బ్లాకుల వేలంపై బీజేపీ నాయకులను టార్గెట్ చేసిన బాల్క సుమన్

కోల్ బ్లాకుల వేలంపై బీజేపీ నాయకులను టార్గెట్ చేసిన బాల్క సుమన్

కోల్ బ్లాకులను వేలం వెయ్యవద్దని సింగరేణి కార్మికులు పోరాటం చేస్తున్నా,మూడు రోజుల దీక్షలు చేస్తున్నా బిజెపి నాయకులు ఎందుకు స్పందించలేదో చెప్పాలని బాల్కసుమన్ నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలోని కోల్ బ్లాకుల వేలాన్ని ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీతో, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఎందుకు మాట్లాడడం లేదని బాల్క సుమన్ ప్రశ్నించారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపకపోతే బిజెపి భరతం పడతామని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులను వేలం వేయాలని ఆ రాష్ట్ర సీఎం మోడీకి విజ్ఞప్తి చేశారని క్షణాలలోనే ఆ ప్రక్రియను విరమించుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఇక ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కూడా బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినా ఆయన ఇప్పటివరకు స్పందించలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు.

 సింగరేణిపై కేంద్రం కుట్రలు.. అందుకే బొగ్గు వేలానికి రెడీ

సింగరేణిపై కేంద్రం కుట్రలు.. అందుకే బొగ్గు వేలానికి రెడీ

సింగరేణి తెలంగాణాకు కొంగుబంగారమని పేర్కొన్న ఆయన, ఏ సూచికలలో చూసినా సింగరేణి టాప్ ప్రభుత్వ రంగ సంస్థగా నిలుస్తోందని పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి పై కేంద్రం కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే బొగ్గు బ్లాకుల వేలానికి రంగం సిద్ధం చేసింది అని ఆరోపించారు ఎమ్మెల్యే బాల్క సుమన్. బిజెపి ధోరణిని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. రహదార్ల విషయంలోనూ, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన ఆరోపించారు.

సింగరేణి కార్మికుల పక్షానే టీఆర్ఎస్

సింగరేణి కార్మికుల పక్షానే టీఆర్ఎస్


సింగరేణి కార్మికుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందని, కార్మికుల సమ్మె ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను రూపొందించి దానిని ప్రకటిస్తామని బాల్క సుమన్ వెల్లడించారు. సింగరేణి కోసం తమ ప్రభుత్వం చేసిన విధంగా పనులు మరే ప్రభుత్వం చేయలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని టార్గెట్ చేస్తూ అటు కేంద్రంలో బీజేపీపై, తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్.

English summary
TRS MLA Balka Suman will flagrantly lash out at the BJP government at the Center. Balka Suman alleged that the Center was trying to give Singareni coal blocks to Adani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X