వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ వెంట వెళ్లేది లేదు: తేల్చి చెప్పిన ఎర్ర శేఖర్..

రేవంత్‌రెడ్డి వెంట వెళ్లే ప్రసక్తే లేదని మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ తాజాగా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీని వీడాల్సిన అ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయి. టీడీపీని వీడి కాంగ్రెస్ లోకి మారేందుకు ఆయన ప్రయత్నిస్తున్న వేళ.. సొంత జిల్లా నేతల మద్దతు కరువవుతోంది.

శుక్రవారం నాడు రేవంత్‌కు ఝలక్ ఇస్తూ కొడంగల్ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ కండువాలు కప్పుకోగా.. రేవంత్‌రెడ్డి వెంట వెళ్లే ప్రసక్తే లేదని మహబూబ్‌నగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ తాజాగా స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పార్టీ మార్పు అంశంపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీని వీడాల్సిన అవసరం తనకైతే లేదని చెప్పుకొచ్చారు.

we never go along with revanth reddy

ఇదిలా ఉంటే, రేవంత్‌రెడ్డి ప్రధాన అనుచరులు జడ్పీటీసీ అనసూయ బాల్‌సింగ్‌నాయక్‌, ఎంపీపీ సంగీత శివకుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్‌, వీరేశ్‌గౌడ్‌ తదితరులు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.

కాగా, రేవంత్ రెడ్డి వచ్చే నెల 9న కాంగ్రెస్ గూటికి చేరేందుకు అంతా సిద్దం చేసుకున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరికకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, తనతో పాటు మరో 25మందిని రేవంత్ తీసుకెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇంతలోనే ఆయన ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన టీటీడీపీ కార్యక్రమానికి హాజరవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ వీడుతాననే సంకేతాలిస్తూనే ఆయన టీడీపీ సమావేశానికి రావడం ఆ పార్టీ నేతలకే అంతుపట్టలేదు. అంతేకాదు ఈ నెల 26న టీడీఎల్పీ సమావేశం కూడా ఉంటుందని చెప్పారు.

English summary
Mahabub Nagar Telugu Desam party president Erra Sekhar clearly said that he never go along with Revanth Reddy into congress party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X